Horoscope Today: ఆ రాశుల వారి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.. శుక్రవారం రాశి ఫలాలు..
Today Rasi Phalalu: మనం ప్రతిరోజూ ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ
Today Rasi Phalalu: మనం ప్రతిరోజూ ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. తమ జీవితంలో ఏం జరుగబోతుందో ముందుగానే తెలుసుకునేందుకు రాశి ఫలాలను అనుసరిస్తారు. అయితే.. శుక్రవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
మేషరాశి: ఈ రాశివారు పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి: ఈ రాశివారు ప్రారంభించిన కార్యక్రమాలను ఆటంకాలు ఎదురైనప్పటికీ.. ధైర్యంగా అధిగమించే ప్రయత్నం చేయాలి. కొంతమంది ప్రవర్తనతో కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మిథున రాశి: ఈ రాశివారు కీలక పనులను చేపడతారు. పలు విషయాలపై పెద్దలను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం కలిగే సూచనలు ఉన్నాయి.
కర్కాటక రాశి: ఈ రాశివారు చేపట్టే పనుల్లో జాప్యం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ భాద్యతలు అధికమవుతాయి. కష్టాలు ఎదురైనప్పటికీ.. జాగ్రత్తగా ముందుకు వెళితే ఫలితం ఉంటుంది.
సింహ రాశి: ఈ రాశివారికి అన్ని రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల, స్నేహితుల సాయం మేలు చేస్తుంది. అనుకున్నది సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కన్య రాశి: చేపట్టే పనుల్లో పురోగతి సాధిస్తారు. శ్రమ పెరిగినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. బంధువులతో, సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి.
తులా రాశి: ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. కీలక విషయాలలో పెద్దలను, బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఆధ్యాత్మిక, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో, సన్నిహితులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి ఉన్నప్పటికీ.. చాలా ఓర్పుతో ముందడుగు వేయాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ధనుస్సు రాశి: ఈ రాశివారికి ఈ రోజు బంధువుల సహకారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మకర రాశి: ఈ రాశివారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. సమస్యలు ఎదురైనప్పటకీ.. అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆస్థులకు సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.
కుంభ రాశి: ఈ రాశి వారు మనోబలం తగ్గకుండా విశ్వాసంతో ముందడుగు వేయాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు చికాకుగా మారుతాయి.
మీన రాశి: ఈ రాశి వారు చేపట్టే పనుల్లో అలసట కనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు బాధపెడతాయి. పెద్దల సహకారం తీసుకుంటే మంచిది. గొడవలకు దూరంగా ఉండాలి.
Also Read: