Horoscope Today: ఖర్చులు, ప్రయణాల విషయాల్లో ఈ రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Rashi Phalalu On May 2nd 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు
Rashi Phalalu On May 2nd 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు ఆదివారం చంద్రుడు మకరంలో ఉండనున్నాడు. మరీ ఈరోజు ఆదివారం (మే 2న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
మేషరాశి..
ఈరోజు వీరు వేరు వేరు రుపాల్లో చేపట్టిన పనులలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అసలు తొందరపడకూడదు. గణపతి సంకటనాష స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృషభరాశి..
ఈరోజు వీరికి అనుకోనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించుకోగలుతారు. పేదవారికి కాయకూరలు దానం చేసుకోవడం మంచిది.
మిథున రాశి..
ఈరోజు వీరికి అనుకోని, అనవసరమైన ఆలోచనలు కలుగుతుంటాయి. వాటిని జాగ్రత్తగా అధిగమించుకోవడం మంచిది. విష్ణు సహస్త్ర నామా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వేరు వేరు రుపాల్లో ఆలోచన విధానాలు కొంత ఇబ్బందులను కలుగచేస్తుంది. దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.
సింహరాశి..
ఈరోజు వీరు అలౌకిక విషయాల పట్ల దూరంగా ఉండాలి. సుబ్రమణ్య స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది.
కన్యరాశి..
ఈరోజు వీరికి రావల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
తులారాశి…
ఈరోజు వీరికి వృత్తి, వ్యాపారాత్మకమైన భావనలు ఏర్పడుతాయి. ఈరోజు వీరికి దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు భూసంబంధమైన వ్యవహరిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సుబ్రమణ్య స్వామి భుజంగా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి మానసికమైన ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పార్వతి అమ్మవారికి కుంకుమ అర్చన మేలు చేస్తుంది.
మకర రాశి..
ఈరోజు వీరికి విందు, వినోద కార్యక్రమాలు ఉంటాయి. శుక్రగ్రహ అర్చన మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈరోజు వీరికి అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ మేలు చేస్తుంది.
మీనరాశి..
ఈరోజు వీరికి వేరు వేరు రుపాల్లో ప్రయణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆరోగ్య విషయాలను జాగ్రత్తగా సరిచూసుకుంటుండాలి. దన్వంతరి సోత్ర పారాయణం మేలు చేస్తుంది.
Also Read: PM Kisan: కరోనా కాలంలో రైతులకు గుడ్న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.7,500… ఎప్పుడంటే..