Horoscope Today: ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా చేస్తే.. మంచి ఫలితాలుంటాయి… ఈరోజు రాశి ఫలాలు…

Horoscope Today on april 25th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా చేస్తే.. మంచి ఫలితాలుంటాయి... ఈరోజు రాశి ఫలాలు...
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 25, 2021 | 7:10 AM

Horoscope Today on april 25th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు (ఏప్రిల్ 25న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు చేపట్టినటువంటి పనులలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగాలు విషయాలు మరింత అనుకూలించనున్నాయి. శ్రీ రాజామాతంగై నమః నామ స్మరణ మేలు చేస్తుంది.

వృషభ రాశి..

ఈరోజు వీరు అనుకోని ప్రయాణాలు చేస్తుంటారు. బాకీలను తీరుస్తాయి. ఐశ్వర్య లక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిధున రాశి..

ఈరోజు వృత్తి, వ్యాపారాల విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలను పొందవచ్చు. శ్రీ వెంకటేశ్వర దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు చేపట్టినటువంటి పనులు అనుకూలంగా పూర్తి చేసుకుంటారు. నూతన పరిచయాలతో లాభాలు ఉంటాయి. చంద్రగ్రహ అర్చన, పార్వతి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

సింహ రాశి..

ఈరోజు వీరు దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ఆర్థిక ప్రగతి చోటుచేసుకుంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటాయి. గణపతి స్త్రోత్ర పారాయణం మంచిది.

కన్యరాశి..

ఈరోజు వీరు ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. గొప్పలకు పోయి దాచుకున్న డబ్బును ఖర్చు చేస్తుంటారు. శ్రీ విష్ణు సహస్ర నామ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులారాశి..

ఈరోజు వీరు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆదిత్యా హృదయ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరు పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్మీ నరసింహ వారి దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరు కుటుంబంలో స్వల్ప చికాకులు ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయడం మంచిది.

మకర రాశి..

ఈరోజు వీరికి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందగా ఉంటారు. లలితా సహస్ర నామ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరు స్నేహితులను కలుసుకుంటారు. అలాగే అధికారికపరమైన సమాలోచనలు జరుపుతారు. శ్రీరామరక్ష స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి…

ఈరోజు వీరు కీలకమైన సమాచారాలు అందుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేయావలసి ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సుదర్శన స్వామి వారి నామ స్మరణ మేలు చేస్తుంది.

Also Read: ఎల్ఐసీ పాలసీదారులరా అలర్ట్.. ఇన్సూరెన్స్, ప్రీమియం స్టేటస్ చెక్ చేయండిలా.. మిగతా వివరాలకు SMS పంపండిలా..

ఐడియా ఇవ్వు.. రూ.5 లక్షలు పట్టు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ.. ఎప్పటివరకు ఛాన్స్ అంటే..