Horoscope Today: ఈరోజు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.. ఈ పనులు చేస్తే మంచి ఫలితాలే ఇక..

Horoscope Today On April 24th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

Horoscope Today: ఈరోజు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.. ఈ పనులు చేస్తే మంచి ఫలితాలే ఇక..
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2021 | 7:26 AM

Horoscope Today On April 24th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరించనున్నాడు. శనివారం (ఏప్రిల్ 24న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు వీరు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. రాజకీయపరమైన అంశాలలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీ రాజమాతాంగై నమః అనే నామస్మరణ మేలు చేస్తుంది.

వృషభ రాశి..

ఈరోజు వీరు తమకు రావాల్సిన బాకీలను వసూలు చేసుకుంటారు. అలాగే సంఘంలో పోటీతత్వాలను అధిగమించడం మంచిది. ఈరోజు వీరు సుబ్రమణ్యస్వామి అర్చన శుభఫలితాలను కలుగజేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు వీరు అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి చేసుకుంటుంటారు. ఆలోచన విధానాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. శివపంచాక్షరి జపం మేలు చేస్తోంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి శ్రమకు తగిన ప్రతిఫలాలు పొందుతుంటారు. సౌకర్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వీరికి నందీశ్వరుని పూజా, అర్చన మేలు చేస్తోంది.

సింహరాశి..

ఈరోజు వీరు దూరపు బంధువులను కలుసుకుంటుంటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలను తొందరగా పూర్తిచేసుకుంటారు. అలాగే మాట విలువ కోల్పోకుండా… జాగ్రత్తగా వ్యవహరించాలి. దుర్గా ఆరాధన మేలు చేస్తోంది.

కన్యరాశి..

ఈరోజు వీరికి సమస్యలతో కూడుకున్న పనులు ఉంటాయి. వాటిని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తుండాలి. సంకటహార గణపతి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి..

ఈరోజు వీరు స్నేహితులను, బంధువులను కలుసుకుంటుంటారు. ఇష్టవస్తు ప్రాప్తి ఆనందాన్ని కలుగచేస్తుంది. లలితా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి సంఘంలో అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆంజనేయ స్వామి స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరు కుటుంబపరమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ రామరక్ష స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి..

ఈరోజు వీరికి శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబపరమైన సమస్యలు చికాకును కలిగిస్తాయి. దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

కుంభరాశి..

ఈరోజు వీరికి ధార్మిక చింతన ఏర్పడుతుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. పేదవారికి కాయగూరలు ధానం చేసుకోవడం మంచిది.

మీనరాశి..

ఈరోజు వీరికి ఆరోగ్య జాగ్రత్తగా ఉండాలి. శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేస్తుంటారు. అద్భుతమైన అవకాశాలు అందుతాయి. ఆంజనేయ స్వామి ఉపాసన మేలు చేస్తుంది.

Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఝలక్.. క్యాష్ విత్ డ్రా, ఎస్ఎంఎస్ చార్జీల పెంపు.. ఎప్పటి నుంచి అంటే..

Covid Scare Rising: మీకు కరోనా సోకిందా.. అయితే ఆరోగ్య భీమా ఎంత ఉండాలో తెలుసా..