Horoscope Today: ఈ రాశుల వారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.. శనివారం రాశిఫలాలు..
చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం.. ఆందోళన ఉంటుంది. శారీరకంగా బలహీనమేర్పడుతుంది. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది.
మేష రాశి..
ఈరోజు ఈరాశి విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. చేపట్టిన పనులను తొందరగా పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు తగ్గుతాయి. బందుమిత్రులను కలుసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరు చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉంటాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి..
ఈరోజు వీరికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులను త్వరగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరు దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుబం పరిస్థితుులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు.
సింహరాశి..
ఈరోజు వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. బంధుమిత్రులతో వైరమేర్పడుతుంది. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
కన్యరాశి..
ఈవీరికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతుంటాయి.
తుల రాశి..
ఈరోజు వీరికి ఆకస్మిక ధనలాభముంటుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి వృత్థి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే పనులను చేస్తారు. శుభకార్యాలలో పాల్గోంటారు.
ధనుస్సు..
ఈరోజు వీరు బంధుమిత్రులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి.
మకర రాశి..
ఈరోజు వీరికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. అధికార భయం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు.
కుంభరాశి..
ఈరోజు వీరు మనోల్లాసాన్ని పొందుతారు. కుటుంబసభ్యులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. సంఘంలో అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వారితో పరిచయం విషయంలో జాగ్రత్తలు అవసరం.
మీనరాశి..
ఈరోజు వీరు తొందరపాటు ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం.. ఆందోళన ఉంటుంది. శారీరకంగా బలహీనమేర్పడుతుంది. వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది.