దిన ఫలాలు మే 8: ఈ రాశుల వారికి ఉద్యోగంలో జాక్‌పాట్.. మీ రాశికి ఇలా..
Horoscope Today (May 8, 2026): మేష రాశి వారు ఇంట్లో శుభకార్యాలు చేపట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభించగా, మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. మొత్తం 12 రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.

దిన ఫలాలు (మే 8, 2026): మేష రాశి వారు ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కుటుంబ సభ్యులంతా కలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో కొన్ని అధికార బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కుటుంబ సభ్యులంతా కలుసుకునే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక మార్గాల్లో ఆదా యం పెరుగుతుంది. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవ హారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. పిల్లలు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కొందరు మిత్రులతో సఖ్యత పెరుగు తుంది. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. మిత్రుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబసమేతంగా ఆలయ సందర్శన చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సకాలంలో పూర్తి చేస్తారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. బంధువుల కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరు అందరికీ నచ్చుతుంది. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు గడిస్తాయి. వ్యక్తిగత విషయాల మీద శ్రద్ధ పెడతారు. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఒకటి రెండు వివాదాలు, సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తలపెట్టిన పనులు మందకొడిగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది. ప్రేమలో పడే అవకాశం ఉంది. ఆదాయం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా పోటీదార్ల ఒత్తిడి తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభ వార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించడం జరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇంట్లో కొన్ని సౌక ర్యాలను మెరుగుపరచుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యల్ని సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఒకరిద్దరు మిత్రులకు సాయం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారులకు మీ సలహాలు ఉపయోగపడతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. రావలసిన డబ్బు చేతికి అందు తుంది కానీ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.