Horoscope Today(01 July): ఉద్యోగపరంగా వారు ఒక మెట్టు పైకి ఎక్కుతారు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Daily Horoscope(01st July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా లెక్కిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య పండితులు రాశుల వారికి ఎలా ఉంటుందన్న విషయాన్ని ముందుగానే అంచనావేస్తారు. మరి 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Daily Horoscope(01st July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా లెక్కిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య పండితులు ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందన్న విషయాన్ని ముందుగానే అంచనావేస్తారు. మరి 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం చేసినప్పటికీ అది విజయం సాధించే అవకాశం ఉంది. సానుకూల దృక్పథంతో వ్యవహ రించండి. అన్నీ అనుకూలంగా జరిగిపోతాయి. మీ ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెళ్లి విరుస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి, అదనపు ఆదాయ ప్రయత్నాలకు అవకాశాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అనూహ్యమైన మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విహారయాత్ర చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత పెరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో ఆశించినంత ప్రోత్సాహం, ఆదరాభిమానాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యమైన అవసరాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. పిల్లలు వృద్ధి చెందుతారు. మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశముంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పని భారం కూడా ఎక్కువగానే ఉంటుంది. డాక్టర్లకు, లాయర్లకు, ఇతర వృత్తి నిపుణులకు క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టొచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో అధికారులతో అతి జాగ్రత్తగా వ్యవ హరించడం మంచిది. అపార్ధాలకు అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. రావలసిన డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది ఈ రాశివారి పరిస్థితి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. సామాజికంగా గౌరవ అభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో కొద్దిగా కలతలు కలహాలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదాలకు దిగకపోవడం మంచిది. స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థిక పరిస్థితి చాలా వరకు సజావుగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఉపయోగం ఉంటుంది. ఈ సలహాలు, సూచనలు అధికారులకు నచ్చుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సహాయ లేదా వితరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వృత్తి జీవితంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. సంపాదనలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారులు లాభాలు గడిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధి స్తారు. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మంచిది. అదనపు ఆదాయ ప్రయ త్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం పరవాలే దనిపిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయపరంగా చిన్నపాటి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలు ఉన్నాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయం పరవాలేదు. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు కొంతవరకు సఫలం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవలసి వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ముఖ్యమైన కుటుంబ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ పరంగా ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలావరకు సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తుల నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..