Horoscope Today: సోమవారం రాశిఫలితాలు.. ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు..

Horoscope Today (20-06-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చేడుల గురించి ఆలోచిస్తారు...

Horoscope Today: సోమవారం రాశిఫలితాలు.. ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు..
Horoscope Today
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 20, 2022 | 6:30 AM

Horoscope Today (20-06-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చేడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 20వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు సహనం కోల్పోకుండా పనులను నిదానంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఒక విషయంలో కుటుంబ సభ్యులతో మాట పడాల్సి వస్తుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. మానసిక ఆందోళనకు గురవుతారు. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శత్రుల విషయంలో ఆవేశం, తొందర పాటు పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అనవసర వాగ్వాదం చేయకండి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ముఖమైన పనులను ప్రారంభించడానికి తగిన సమయం. మానసికంగా సంతోషంగా ఉంటారు. శుభకాలం. వృత్తి, ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ముఖ్యమైన విషయం కోసం పెద్దల సలహాలను తీసుకోవడం మేలు చేస్తుంది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్నా పని పూర్తి చేసే అవకాశం ఉంది. మీ పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. అధిక శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అనవసర వ్యయం చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభవార్త వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి కీలక విషయాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని వారికీ శుభకాలం.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారు అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. కీలక సమయాలలో ఆలోచించి స్పందించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభ వార్తలు వింటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అవసరానికి తగిన డబ్బుని అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. బంధు, మిత్రులతో అవవసరానికి తగిన సహకారం అందుకుంటారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్ధికంగా శుభఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనులలో విజయాన్ని సొంతం చేసుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాల్లో తగిన ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారు అధిక శ్రమతో కూడిన ఫలితాలను అందుకుంటారు. దైవ దర్శనం వలన సంతోషంగా ఉంటారు.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు