Horoscope Today: ఈ రాశివారికి కుటుంబంలో కలహాలు.. అనవసరమైన ఖర్చులు
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం..
Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. తమ తమ రోజువారీ రాశి ఫలాలను బట్టి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. జూలై 11 (సోమవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
- మేష రాశి: ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. చేపట్టే పనులలో తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు.
- వృషభ రాశి: కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది.
- మిథున రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మంచితనం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
- కర్కాటక రాశి: అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో బేధాలు ఏర్పడే అవకాశం ఉంది. సమయానికి డబ్బులు చేతికి అందుతుంది.
- సింహ రాశి: ఒక వ్యవహారంలో ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.
- కన్య రాశి: నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. అవవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.
- తుల రాశి: పెద్దల సహాకారం ఎంతో మేలు చేస్తుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన భయాందోళనలకు గురవుతారు. ఖర్చులు పెరుగకుండా చూసుకోవాలి.
- వృశ్చిక రాశి: మీ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సహకారం అందుకుంటారు.
- ధనుస్సు రాశి: శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక వ్యవహారాలలో ఓర్పిగా వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.
- మకర రాశి: మీమీ రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సంతోషంగా గడుపుతారు. కీలక సమస్యలను పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
- కుంభ రాశి: కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కీలక పనులలో పురోగతి లభిస్తుంది. ప్రయాణాలు చేస్తారు.
- మీన రాశి: చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురుగా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు తప్పవు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి