Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి మాములు రాబడి కాదు… 12 రాశుల వారికి బుధవారం నాటి దినఫలాలు

మకరం వారు వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. సింహ రాశివారికి ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి తప్ప ఇతర సమస్యలేవీ ఉండకపోవచ్చు. కుంభం వారికి వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వారికి బుధవారం నాటి దినఫలాలు పూర్తిగా తెలుసుకుందాం పదండి....

Horoscope Today: వారికి మాములు రాబడి కాదు...  12 రాశుల వారికి బుధవారం నాటి దినఫలాలు
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 05, 2025 | 7:40 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో కొత్త లక్ష్యాలు, బాద్యతలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కూడా చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమ స్యలు కాస్తంత తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారాలు బాగా ఉత్సా హంగా, ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తి స్తారు. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. కొందరు మిత్రుల విషయంలో జాగ్ర త్తగా ఉండడం మంచిది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. అను కోకుండా ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యలు సద్దుమణుగు తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) వృత్తి, వ్యాపారాల్లో బాగానే పురోగతి చెందుతారు. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో సంపాదన పెరు గుతుంది. ఆర్థిక సంబంధమైన ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. శుభకార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చులు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి ప్రయో జనం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. .

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో అధికారుల వల్ల ఒత్తిడి, ఇబ్బందులు ఉండవచ్చు. సహోద్యోగులతో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయానికి లోటుండదు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. కొందరు బంధుమిత్రులతో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

సింహ (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో కొద్దిగా పని ఒత్తిడి తప్ప ఇతర సమస్యలేవీ ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సభ్యుల సహాయంతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. కుటుంబ జీవితం సామరస్యంగా సాగి పోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురు తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఇతర సంస్థల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాబాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందు తుంది. ఇష్టమైన మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక, రుణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపో తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో పని భారం ఉన్నా సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవ హారాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్ట పోయే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగ జీవితం చాలావరకు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు అందుకుం టారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. చదువుల్లో ఉన్న పిల్లలు ఘన విజయాలు సాధి స్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. యాక్టివిటీ కూడా వృద్ధి చెందడం జరుగు తుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూ లంగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన పెండింగ్ పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయ త్నాల్లో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరు స్తాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు, అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంత ఉత్సాహం కలిగిస్తాయి. పెళ్లి సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తల పెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండకపో వచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆర్థికంగా ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

జయలలిత ఆస్తులు అప్పగింత.. మొత్తం ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా..
జయలలిత ఆస్తులు అప్పగింత.. మొత్తం ఎన్ని కేజీల బంగారం ఉందో తెలుసా..
ఈ పచ్చి పండు డయాబెటిస్ రోగులకు అమృతం.. డ్రైఫ్రూట్స్‌ కంటే ఆరోగ్యం
ఈ పచ్చి పండు డయాబెటిస్ రోగులకు అమృతం.. డ్రైఫ్రూట్స్‌ కంటే ఆరోగ్యం
న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ... స్టార్ పేసర్ గాయంతో ఔట్!
న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ... స్టార్ పేసర్ గాయంతో ఔట్!
సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. ?
సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. ?
మీరు చనిపోయినట్లు కలలో కనిపిస్తే దాని సంకేతం ఏంటి..?
మీరు చనిపోయినట్లు కలలో కనిపిస్తే దాని సంకేతం ఏంటి..?
అయ్యో దేవుడా.. కుంభమేళాకు వెళ్తుండగా అర్ధరాత్రి ఊహించని ప్రమాదం..
అయ్యో దేవుడా.. కుంభమేళాకు వెళ్తుండగా అర్ధరాత్రి ఊహించని ప్రమాదం..
మావుళ్ళమ్మ ఉత్సవాల్లో అమ్మవారి లడ్డూ వేలం.. ఎంత పలికిందంటే..?
మావుళ్ళమ్మ ఉత్సవాల్లో అమ్మవారి లడ్డూ వేలం.. ఎంత పలికిందంటే..?
ఫుడ్ ఆర్డర్ చేసేవారికి అలెర్ట్.. ఇవి డేంజర్
ఫుడ్ ఆర్డర్ చేసేవారికి అలెర్ట్.. ఇవి డేంజర్
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఒక్క సినిమాతోనే సెన్సేషన్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఒక్క సినిమాతోనే సెన్సేషన్..
17 ఏళ్ల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ మంచి రోజులు.. ఆశ్చర్యపోయే గణాంకాలు!
17 ఏళ్ల తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ మంచి రోజులు.. ఆశ్చర్యపోయే గణాంకాలు!