Horoscope Today: ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారం.. 12 రాశుల వారి రాశిఫలాలు

ఫిబ్రవరి 3న కన్య రాశి వారికి ఆదాయం పెంచుకోవడానికి అనేక అవకాశాలు అంది వస్తాయి. వృశ్చికం వారు ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకరం రాశివారికి ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. మీనం రాశివారికి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు అన్ని రాశుల వారి ఫలాలు తెలుసుకుందాం పదండి...

Horoscope Today: ఆ రాశి వారికి పట్టిందల్లా బంగారం.. 12 రాశుల వారి రాశిఫలాలు
3 february horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2025 | 5:37 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురువు ఉన్నంత కాలం ఆదాయానికి లోటుండదు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంటుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఉద్యో గంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సోదరు లతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి, కొత్త ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం నిలకడగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. నిరుద్యోగుల కలలు సాకారం అవు తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతి లభించడంతో పాటు ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆదాయ వృద్ధికి చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. అనారోగ్యం నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహా యంతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు అవకాశాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత, ప్రతిభ మరింతగా పెరుగుతుంది. అధికారులు అనేక విధాలుగా ప్రోత్సహిస్తారు. వ్యాపారాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా సాగిపో తుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదరులతో అనుకూలతలు ఏర్పడతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయం పెంచుకోవడానికి అనేక అవకాశాలు అంది వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా విముక్తి లభిస్తుంది. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యో గాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. కొందరు ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి సంపాదన పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఊహించని విధంగా సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం నిలకడగా సాగిపో తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబపరంగా శ్రమ, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజా వుగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు కొత్త లక్ష్యాలు, బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అదనపు రాబడికి బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఇష్టమైన బంధువులతో శుభ కార్యంలో పాల్గొంటారు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయానికి లోటుండదు. ముఖ్యమైన అవసరాలు గడిచిపోతాయి. కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఇంటా బయటా మాటకు విలువ పెరు గుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లి విరు స్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. విలాసాలు, మిత్రుల మీద ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవ హారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటవుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందడంతో పాటు ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు త్వరితగతిన పూర్త వుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.