Horoscope Today: ఆ రాశి వారికి ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Today Horoscope (January 29, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు అందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (జనవరి 29, 2025): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు అందే అవకాశముంది. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగ జీవితం బాగా ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరగడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. శ్రమాధిక్యత ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగానే వృద్ది చెందుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. ఇంటా బయటా పని ఒత్తిడికి అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను గట్టి ప్రయత్నంతో పూర్తి చేస్తారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు అందుకుంటారు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు సంబంధించి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, రాబడి ఎక్కువగా ఉండే అవకాశముంది. కొద్ది ప్రయత్నంతో పెండింగు పనులన్నీ సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి వివాదం ఒకటి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశముంది. రావలసిన సొమ్ము కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకూ బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభ కార్యంలో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతానికి స్థాన చలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. రుణ దాతల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కుటుంబ సభ్యుల సహ కారంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపో తాయి. ఇంటా బయటా అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను విజ యవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభే దాలు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. విదే శాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవి తంలో ఊహించని పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా గడుపుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పని భారం ఉన్నా ఫలితముంటుంది. వృత్తి జీవితం ప్రోత్సా హకరంగా, ఆశాజనకంగా పురోగతి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరు గుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో, ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తలు పాటించడం మంచిది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, వ్యాపారాల్లో చిన్నా చితకా కష్టనష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. ఆదాయంతో సమానంగా అనవ సర ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కొద్దిగా ఒత్తిడి కలిగిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఉద్యోగ జీవితం చాలావరకు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయానికి లోటుండదు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయ త్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది పాటి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులతో కొన్ని బాధ్యతలు పంచుకుం టారు. అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం పొందుతారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో చక్కబెడతారు. ప్రయాణాలు లాభిస్తాయి.