- Telugu News Photo Gallery Spiritual photos Six grahas yuti in meena rashi these zodiac signs to have raja yogas details in telugu
Raja Yoga: ఆరు గ్రహాల యుతి.. వారికి కలలో కూడా ఊహించని రాజయోగాలు..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక రాశిలో అయిదుకు మించి గ్రహాలు యుతి చెందడం ఒక విశిష్టతను సంతరించుకుంటుంది. దీనివల్ల జీవితంలో కలలో కూడా ఊహించని రాజయోగాలు కలిగే అవకాశం ఉంటుంది. మార్చి 29, 30 తేదీల్లో మీన రాశిలో ఏకంగా ఆరు గ్రహాలు కలవడం జరుగుతోంది. దీనిని షష్ట గ్రహ కూటమిగా జ్యోతిషశాస్త్రం పరిగణిస్తుంది. మార్చి 29, 30 తేదీల్లో మాత్రమే ఈ షష్ట గ్రహ కూటమి సంభవిస్తున్నప్పటికీ, దాని ఫలితం మాత్రం మే నెలాఖరు వరకూ ఉంటుంది. శని, బుధ, శుక్ర, చంద్ర, రాహు, చంద్రుల ఈ కలయిక వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మకరం, కుంభ రాశుల వారి జీవితాల్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.
Updated on: Jan 28, 2025 | 6:12 PM

వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి అనేక ఉద్యోగా వకాశాలు, అనేక ఆదాయ వృద్ధి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో శీఘ్రగతిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. సంతాన యోగం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా బాగా లాభాలు కలుగుతాయి.

మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఆరు గ్రహాలు యుతి చెందడం వల్ల ఉద్యోగంలో అనేక శుభ యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడం గానీ, ఒక సంస్థకు అధిపతి కావడం గానీ తప్పకుండా జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం కలుగుతుంది.

కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఆరు గ్రహాల సంచారం వల్ల ఉద్యోగరీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో విదేశీ సంబంధాలు ఏర్పడతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తిపాస్తుల సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనేక అవకాశాలు అంది వస్తాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల జీవితంలో కనీ వినీ ఎరుగని పురో గతి కలుగుతుంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ, తప్పకుండా అభివృద్ధి చెందడం జరుగు తుంది. ప్రతిభా పాటవాలు, సమర్థత బాగా వెలుగులోకి వస్తాయి. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం అనేక మార్గాల్లో వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు కనక వర్షం కురిపిస్తాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.

మకరం: ఈ రాశికి మూడవ స్థానంలో ఆరు గ్రహాలు చేరడం వల్ల ఈ రాశివారికి అన్ని రంగాల్లోనూ శీఘ్ర పురోగతి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెందుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రయాణాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యో గాలు చేసుకుంటున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆకస్మిక దన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

కుంభం: ఈ రాశికి ధన స్థానంలో షష్ట గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఆదాయ వృద్ధికి అనేక మార్గాలు ఏర్పడతాయి. ఆకస్మికంగా, అప్రయత్నంగా ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా కలిసి వస్తాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది.



