Horoscope Today: రాశిఫలాలు నేడు…. ఏ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉండి చేపట్టిన పనులు జరుగుతాయంటే..

Horoscope Today (September 25th 2021):  ఆధునిక కాలంలో కూడా మంచి చెడులు రాశుల ప్రభావంపై జరుగుతాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు..

Horoscope Today: రాశిఫలాలు నేడు.... ఏ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉండి చేపట్టిన పనులు జరుగుతాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Sep 25, 2021 | 6:47 AM

Horoscope Today (September 25th 2021):  ఆధునిక కాలంలో కూడా మంచి చెడులు రాశుల ప్రభావంపై జరుగుతాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. అంతేకాదు రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా తమ రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 25వ తేదీ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి  పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేపట్టిన పనులను సక్సెస్ ఫుల్ గా చేయగలుగుతారు. అందరి ప్రశంసలను పొందుతారు.

వృషభ రాశి: ఈరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కలహాలకు దూరంగా ఉండడం మంచిది అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. కీలక ప్రణాళికతో వాటిని ప్రారంభించే అవకాశం ఉంది.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు  కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి పొందుతారు. నూతన వస్తు, వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.  శుభవార్త వింటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు తెలివితేటలతో చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. లాభదాయకంగా ఉంటుంది. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి: ఈరోజు రాశివారు ఉద్యోగ విషయాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఒత్తిడిని జయించాలంటే చంచలత్వాన్ని దరిచేరకుండా ఉండాలి.

కన్య రాశి: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల విషయంలో అలోచించి అడుగులు వేయాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్లి.. అనుకున్న విషయంలో విజయం పొందుతారు.

తుల రాశి: ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారికి గ్రహబలం ఉత్తమంగా ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అనుకోని అదృష్టం వరిస్తుంది.  కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శుభవార్తను వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు.

మకర రాశి: ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమఫలితాలు అందుతాయి. పట్టుదలతో ముందుకుసాగాల్సి ఉంది. అనారోగ్యబారిన పడతారు. అధిక శ్రమకు గురవుతారు.  పట్టుదలతో  పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

కుంభ రాశి: ఈరాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం సాధిస్తారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. శుభకార్యక్రాల్లో పాల్గొంటారు. శుభవార్తను వింటారు.  బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టిన పనులు తోటివారి సహకారంతో విజయవంతంగా పూర్తి చేస్తారు.

Also Read:

దర్శనంతోనే పాపాలను హరించే ఈ క్షేత్రంలో.. అర్జునుడు శివుడికోసం తపస్సు చేసినట్లు పురాణాల కథనం..