Horoscope Today: ఆ రాశివారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు

దినఫలాలు (అక్టోబర్ 19, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొన్ని లోటుపాట్లు చోటు చేసుకోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. మే రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశివారు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు
Horoscope Today 19th October 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 19, 2023 | 5:01 AM

దినఫలాలు (అక్టోబర్ 19, 2023): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొన్ని లోటుపాట్లు చోటు చేసుకోవచ్చు. మిథున రాశి వారికి ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. మే రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులు కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ఆర్థిక వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. మీ ప్రయత్నాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బాధ్యతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండడం మంచిది. కొన్ని లోటుపాట్లు చోటు చేసుకోవచ్చు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు కొద్దిగా ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులు మామూలు ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలలో, వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పుంజుకోవడం జరుగుతుంది. ప్రయత్న లోపం లేకుండా ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా సఫలం అవుతుంది. వివాహ ప్రయత్నాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. ఆశించిన పురోగతికి అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా శుభవార్త వినే అవకాశం ఉంది. సతీమణితో అన్యోన్యత పెరిగే సూచనలు న్నాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది. గౌరవాభిమానాలు పెరుగుతాయి. నిరుద్యోగులు తప్పకుండా శుభవార్త వింటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉన్నతస్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవ కాశం ఉంది. ఎవరితోనూ తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. ఇరుగు పొరుగుతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ విషయాల్లో ఒత్తిడి తగ్గు తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఫలించే సూచనలున్నాయి. ఉద్యోగులు మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారంలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందు తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ సభ్యులతో సంప్ర దించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశివారికి ప్రాధాన్యం పెరు గుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబపరంగా ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో తల్లితండ్రుల సహాయ సహకారాలు ఉంటాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజ నీర్లు, ఐ.టి నిపుణుల వంటి వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. బాకీలు కూడా వసూలు అవుతాయి. ముఖ్యమైన అవ సరాలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది. సన్నిహితు లతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఇతరులకు వీలైనంతగా ఆర్థిక సహాయం చేస్తారు. సతీమణితో మాటా మాటా పెరగకుండా జాగ్రత్త పడడం మంచిది.

‍ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలలో బాగా ఒత్తిడి, శ్రమ పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో మరింత శ్రద్ధపెట్టడం అవసరం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్ని హితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడానికి ఇది సమయం కాదు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా చురుకుగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రయాణాల్లో డబ్బు నష్టపోతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. సతీమణికి ఉద్యోగపరంగా ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయ త్నంతో చేతికి అందుతుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో సహో ద్యోగుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయ. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలం అవు తాయి. ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం శ్రేయ స్కరం. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చ వద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. చేప ట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విలు వైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల అభివృద్ధికి సంబంధించి శుభ వార్తలు వింటారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో విహార యాత్ర లకు ప్లాన్ చేస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.