Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు

దిన ఫలాలు (జూలై 19, 2024): మేష రాశి వారికి అయిదు గ్రహాలు బాగా అనుకూలంగా ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆశించిన స్థాయి స్థిరత్వం ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
Horoscope Today 19th July 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 19, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూలై 19, 2024): మేష రాశి వారికి అయిదు గ్రహాలు బాగా అనుకూలంగా ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితంలో ఆశించిన స్థాయి స్థిరత్వం ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ప్రస్తుతం ఈ రాశివారికి మొత్తం మీద అయిదు గ్రహాలు బాగా అనుకూలంగా ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. సొంత పనులు మీద శ్రద్ధ పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

దశమంలో దశమాధిపతి శని, లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల ఉద్యోగ జీవితంలో ఆశించిన స్థాయి స్థిరత్వం ఏర్పడుతుంది. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిల కడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. లాభాలకు లోటుండక పోవచ్చు. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం, సానుకూలత పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయంగా నిలబడ తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుభ గ్రహాలతో ధన స్థానం పటిష్ఠంగా ఉన్నందువల్ల ఆదాయం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. తలపెట్టిన పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

అష్టమ శని కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నప్పటికీ, పట్టుదలగా పనులన్నిటినీ పూర్తి చేసే అవకాశం ఉంది. ఇతర గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. పిల్లలు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రాశ్యధిపతి రవి వ్యయ స్థానంలో ప్రవేశించినందువల్ల ఉద్యోగంలో స్థాన చలనానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అను కూలంగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యయ ప్రయాస లతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

భాగ్య స్థానంలో గురువు, ఆరవ స్థానంలో శని కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. నిరు ద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. తండ్రి సహాయ, సహకారాలు లభిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు, లాభ స్థానంలో బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు కూడా లాభాలు పుంజుకుంటాయి. ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగుల ఆశయం నెరవేరుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి, మంచి సంబంధం కుదు రుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఢోకా ఉండదు. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అర్ధాష్టమ శని వల్ల ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది. కొద్దిగా అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడు సప్తమంలో గురువుతో కలిసి ఉన్నందువల్ల ఆదాయానికి లోటుం డదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు లాభదాయంగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఉచిత సహాయాలు కట్టిపెట్టడం మంచిది. హామీలు ఉండడం, వాగ్దానాలు చేయడం కూడా పెట్టుకోవద్దు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

తృతీయంలో శని, దశమ స్థానంలో బుధుడి సంచారం వల్ల ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభ పరి ణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశిం చిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధువుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదురు తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

గురు, శనులు, శుక్ర, రవుల అనుకూలత వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటలో సాగిపోతాయి. ఆర్థిక లావాదేవీలకు, రాతపూర్వక ఒప్పందాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడంలో ముందుంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శని కారణంగా శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులు అతిగా ఉపయోగించుకోవడం జరు గుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కు వగా ఉంటుంది. బుధుడి అనుకూలత వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మంచి పరి చయాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగు లకు దూర ప్రాంతం నుంచి మంచి ఆఫర్ అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

పంచమ స్థానంలోని శుక్ర, రవుల వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, ఏలిన్నాటి శని ప్రభావం వల్ల చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ బాగా పెరుగుతుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగు తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.