AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: లాభస్థానంలో అనుకూల గ్రహాలు.. వారికి ఇబ్బడిముబ్బడిగా పెరగనున్న ఆదాయం..!

జ్యోతిషశాస్త్రంలో లాభ స్థానానికి, అంటే 11వ స్థానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ పదకొండవ స్థానాన్ని బట్టి జాతకుల ఆర్థిక పరిస్థితిని, పురోగతిని, స్నేహాలను, శుభ పరిణామాలను నిర్ధా రించాల్సి ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచార రీత్యా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక రాశులకు రెండు నెలల కాలంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం..

Money Astrology: లాభస్థానంలో అనుకూల గ్రహాలు.. వారికి ఇబ్బడిముబ్బడిగా పెరగనున్న ఆదాయం..!
Money Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 18, 2024 | 5:47 PM

Share

జ్యోతిషశాస్త్రంలో లాభ స్థానానికి, అంటే 11వ స్థానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ పదకొండవ స్థానాన్ని బట్టి జాతకుల ఆర్థిక పరిస్థితిని, పురోగతిని, స్నేహాలను, శుభ పరిణామాలను నిర్ధా రించాల్సి ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచార రీత్యా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక రాశులకు రెండు నెలల కాలంలో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరగడం, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి చేసుకోవడం, ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

  1. మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో లాభాధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి చోట చేసుకుంటుంది. వ్యాపారాలు కూడా క్రమంగా నష్టాల నుంచి బయటపడి అభివృద్ధి బాట పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగపరంగా డిమాండ్ కూడా పెరుగుతుంది. మంచి అవ కాశాలు అంది వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి.
  2. వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాక కుటుంబపరంగా కూడా ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. విభిన్న వర్గాలకు చెందిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు, ఆస్తి ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవ కాశం ఉంది. సోదర వర్గం ఆర్థికంగా స్థిరపడుతుంది. పిల్లలు ఆశించిన ఘన విజయాలు సాధిస్తారు.
  3. కర్కాటకం: ఈ రాశికి పదకొండవ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన కుజ, గురులు సంచారం చేస్తున్నందువల్ల వీరికి అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, ముఖ్యంగా సంపన్న వర్గాలతో పరిచయాలు పెరగడం, వ్యాపార ఒప్పందాలు కుదరడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, ప్రాధాన్యం పెరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలిగిపోతాయి. సంతాన యోగానికి బాగా అవకాశముంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రవి, శుక్రుల సంచారం అత్యంత యోగదాయకం. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ప్రభుత్వ మూలక ధన లాభం, ప్రభుత్వపరంగా గుర్తింపు లభిస్తాయి. రాజకీ యంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరిస్థితులు మారిపోతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  5. తుల: ఈ రాశికి 11వ స్థానంలో ఈ రాశికి అత్యంత శుభ గ్రహమైన బుధుడు సంచారం చేయడం వల్ల, వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. వీటిని విస్తరించే అవకాశం కూడా ఉంది. వ్యాపారవేత్తలతో, బ్యాంకర్లతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవా లకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పితృమూలక ధన లాభానికి, వారసత్వ సంపదకు అవకాశం ఉంది. కుటుంబంలో వివాహం జరగడం వంటి శుభ పరిణామాలు తప్పకుండా చోటు చేసుకుంటాయి.
  6. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో కేతువు సంచారం వల్ల కుటుంబంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న వివాహాది శుభ కార్యాలు తప్పకుండా పూర్త వుతాయి. ఆస్తి వివాదం, కోర్టు కేసులు వంటివి సానుకూలంగా పరిష్కారం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని పురోగతి ఉంటుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి.