Zodiac Signs: ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..

జ్యోతిష శాస్త్రంలో రవి, శుక్ర గ్రహాలు రెండూ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన గ్రహాలు. ఇందులో శుక్రుడు ఆదాయ వృద్ధికి కూడా సంబంధించిన గ్రహం. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం కర్కాటక రాశిలో వచ్చే నెల 16 వరకూ కలిసి ఉండబోతున్నందువల్ల కొన్ని రాశులకు అధికార యోగంతో పాటు ఆదాయాన్ని పెంచడం..

Zodiac Signs: ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార, ఆదాయ యోగాలు..
Zodiac Signs in Telugu
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 19, 2024 | 6:18 PM

జ్యోతిష శాస్త్రంలో రవి, శుక్ర గ్రహాలు రెండూ రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన గ్రహాలు. ఇందులో శుక్రుడు ఆదాయ వృద్ధికి కూడా సంబంధించిన గ్రహం. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం కర్కాటక రాశిలో వచ్చే నెల 16 వరకూ కలిసి ఉండబోతున్నందువల్ల కొన్ని రాశులకు అధికార యోగంతో పాటు ఆదాయాన్ని పెంచడం, ఆరోగ్యాన్నివ్వడం వంటివి కూడా జరుగుతాయి. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారికి తప్పకుండా జీవితంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అధికారంతో పాటు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, శుక్రుల సంచారం వల్ల తప్పకుండా హోదా పెరుగుతుంది. ఉద్యో గంలో అధికారుల నుంచి ఆదరణ, అనుకూలతలు బాగా పెరుగుతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ది చెందుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు కొత్త పుంతలు తొక్కు తాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. అధికారంతో పాటు ఆర్థిక యోగం పట్టడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఆదాయ అవకాశాలు బాగా అందుబాటులోకి వస్తాయి.
  2. మిథునం: ఈ రాశివారికి ధన స్థానంలో రవి, శుక్రుల కలయిక వల్ల అనేక వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు తప్పకుండా వృద్ధి చెందుతాయి. లాభదాయక పరిచయాలేర్పడతాయి. సామాజికంగా గౌరవ మర్యాదలకు లోటుండదు.
  3. కర్కాటకం: ఈ రాశిలో రవి, శుక్రుల సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగంలో శుభ పరిణామాలు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలపరంగా జోరు పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంటా బయటా ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కెరీర్ లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
  4. కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రవి, శుక్రుల కలయిక వల్ల, అనేక ఆశలు, ఆశయాలు నెరవేరే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి, సఖ్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.
  5. తుల: ఈ రాశికి దశమ స్థానంలో రవి, శుక్రుల యుతి రాజయోగాన్నిస్తుంది. ఉద్యోగంలో కని విని ఎరు గని విధంగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థానాలు లభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యో గం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లడం జరుగు తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  6. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో రవి, శుక్రుల కలయిక వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం కావడం వంటివి జరుగుతాయి. ఏది చేసినా చెలామణీ అవుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. రావలసిన డబ్బు, బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది.

ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
ఒకే రాశిలో రవి, శుక్ర గ్రహాలు.. ఈ రాశుల వారికి అధికార,ఆదాయ యోగాలు
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
IND vs SL: భారత జట్టులోకి ఆరుగురు కేకేఆర్ ప్లేయర్లు..
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
తలకు బలంగా తాకిన బంతి.. కట్ చేస్తే.. మైదానంలో రక్తపుమడుగులో బౌలర్
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
వర్షాకాలంలో కాళ్లకు వచ్చే చర్మ సమస్యలకు.. ఈ చిట్కాలతో ఉపశమనం..
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. అక్కడ మరో మరణం..! నిపుణుల సలహా.
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా.. ?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్‌కు మించిన ప్రాధాన్యం ఎందుకు?
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్‌వే.. తక్కువ బడ్జెట్‌లో టూర్‌
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్
Microsoft: సమస్యను ఎలా పరిష్కరించాలో తెలిపిన కంపెనీ మైక్రోసాఫ్ట్