Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఇలా..

దిన ఫలాలు (డిసెంబర్ 19, 2023): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆర్థిక లావాదేవీల విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఇలా..
Horoscope Today 19th December 2023
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 19, 2023 | 5:01 AM

దిన ఫలాలు (డిసెంబర్ 19, 2023): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. వృషభ రాశి వారికి సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. కొద్దిగా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ప్రయాణాలలో కొద్దిగా ఇబ్బందులు పడతారు. తలపెట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాలు స్నేహితుల సహాయంతో సునాయాసంగా పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్వగృహంలో మార్పులు, చేర్పులు చేపడతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు, సహచరుల కార ణంగా ఒత్తిడి పెరుగుతుంది. సకాలంలో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వివిధ వృత్తు లకు చెందిన వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తే మంచిది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పొదుపు సూత్రాలు పాటిస్తారు. కీలకమైన వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ప్రయోజనం పొందుతారు. సతీమణితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో కలిసి శుభకార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగు తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డబ్బు నష్టపోవడం గానీ, మోసపోవడం గానీ జరుగుతుంది. ఆర్థిక లావా దేవీలు పెట్టుకోకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఇతరుల వ్యవహా రాల్లో తలదూర్చవద్దు. ఇతరులకు వాగ్దానాలు చేయడానికి, హామీలు ఉండడానికి ఇది సమ యం కాదు. అదనపు ఆదాయ మార్గాలు సానుకూలపడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు కూడా నిలకడగా ముందుకు సాగుతాయి. మీ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. గౌరవ మర్యా దలు పెరుగుతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరు ద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. చిన్న నాటి మిత్రులతో ఉత్సాహంగా విందులో పాల్గొంటారు. ఆరోగ్యం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో సంపాదన బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. ఎవరికీ ఎక్కడా హామీలు ఉండవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక లావా దేవీలు ఫలిస్తాయి. శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. గతంలో తీసుకున్ననిర్ణయాలు, చేసిన ప్రయత్నాలు ‍సత్ఫలితాలనిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరో నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరి స్థితులుంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో ప్రయాణిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రముఖులతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా సంపాదన ఆశాజనకంగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగు తాయి. ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ జీవితం చాలావరకు ప్రశాంతంగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అందరినీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగు తాయి. ఇంటికి అవసరమైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయా ణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేపడతారు. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. దైవ కార్యాల్లో పాల్గొం టారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగు తుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగపరంగా సతీమణి తరఫు నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.