Money Astrology: కన్యా రాశిలో సంచరిస్తున్న కేతువు ప్రభావం.. ఆ రాశుల వారికి ఆదాయ మార్గాలు పెరుగే అవకాశం..!
ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న కేతువు ఆరు రాశులకు అనుకూలంగా మారడం జరిగింది. సాధారణంగా ఏ రాశివారికీ మేలు చేయని ఈ పాప గ్రహం (వక్ర గ్రహం) కొద్దిగా మారి మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి అనుకూలంగా మారి అనుగ్రహించబోతున్నాడు. వీరి మనసులోని కోరికలు చాలావరకు తీరడమే కాకుండా, అనారోగ్య బాధలు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.
ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న కేతువు ఆరు రాశులకు అనుకూలంగా మారడం జరిగింది. సాధారణంగా ఏ రాశివారికీ మేలు చేయని ఈ పాప గ్రహం (వక్ర గ్రహం) కొద్దిగా మారి మేషం, కర్కాటకం, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి అనుకూలంగా మారి అనుగ్రహించబోతున్నాడు. వీరి మనసులోని కోరికలు చాలావరకు తీరడమే కాకుండా, అనారోగ్య బాధలు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఉద్యోగ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఈ కేతువు అనుగ్రహం దాదాపు ఫిబ్రవరి ద్వితీయార్థం వరకు కొనసాగుతుంది. కేతువు కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఎక్కువగా స్కంద స్తోత్రం లేదా సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం మంచిది.
- మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో సంచరించడం వల్ల కేతువు యోగకారకుడవుతున్నాడు. శత్రు, రోగ, రుణ సమస్యలను చాలావరకు తగ్గించే అవకాశం ఉంది. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్లు వెనుకంజ వేయడం గానీ, నిష్క్రమించడం గానీ జరుగుతుంది. అదే విధంగా అనారోగ్యాల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యుడు లేదా చికిత్స లభించే అవకాశం ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వారు తీసుకు వచ్చి ఇవ్వడం, రావలసిన డబ్బు రావడం వంటివి జరుగుతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఆటంకాలు లేకుండా ఆప్రయత్నంగా నెరవేరుతుంది. అనుకున్న పనుల అనుకున్నట్టు పూర్తవుతాయి. తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది. ప్రమోషన్లలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. సోదరులతో విభేదాలు సమసిపోయి, సఖ్యత ఏర్పడుతుంది. స్థలం లేదా పొలం వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో కేతువు సంచారం వల్ల అనుకోని మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి, లాటరీలు, జూదాలు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి వీలైన వైద్య సహాయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. వారసత్వ ఆస్తి సంక్రమించే అవకాశం కూడా ఉంది. కళారంగం లేదా ఆధ్యాత్మిక రంగానికి చెందిన వారితో పరిచయాలు పెరుగుతాయి.
- ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్న కేతువు సాధారణంగా వృత్తి, ఉద్యోగ సంబంధమైన యోగాన్ని కలగజేస్తాడు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. సామాజికంగా కూడా ప్రాభవం పెరిగే అవకాశం ఉంది. మాటకు విలువ ఉంటుంది.
- మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తండ్రి నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి. తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మొక్కుబడులు తీర్చుకుంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.