Horoscope Today: ఈ రాశివారు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు.. అనవసర ఖర్చులు పెరుగుతాయి
Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు..
Horoscope Today: ప్రస్తుత ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే జూలై 17న రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి:
ఈ రాశివారు చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. పడరాని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంతో మేలు చేస్తుంది.
వృషభరాశి
సొంత నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. తోటివారి సలహాలు, సూచనలు పాటించడం ఎంతో మంచిది. కొందరి వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకావశాలున్నాయి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ఆధారణ మేలు చేస్తుంది.
మిథునం
కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అకస్మిక ప్రయాణాలు చేస్తుంటారు. అమ్మవారిని ఆరాధించడం మంచిది.
కర్కాకటరాశి
పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఆంజనేయస్వామి స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంది.
సింహరాశి
బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు తలెత్త అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగకుండా జాగ్రత్తగా ఉండాలి. శివ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
కన్యరాశి
వ్యాపారాలలో ముందుకు సాగుతారు. కుటుంబ సలహాలతో మంచి విజయాలు సాధిస్తారు. ఈ రోజు చేసే పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇష్టదేవతను ఆరాధించడం మంచి ఫలితాలు ఉంటాయి.
తులరాశి
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచి ఫలితాలు ఇస్తాయి. కుటుంబంలో మంచి ప్రశాంతత ఉంటుంది. ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అపర్థాలు చేసుకునే అవకాశం ఉంది. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి
పనులు చేసే ముందు ఆలోచించి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. శివుడిని పూజించడం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దుర్గదేవిని ఆరాధించడం మంచిది.
మకర రాశి
ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు చాలా అవసరం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఆంజనేయస్వామి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. చేసే పనిలో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహాలు, సూచనలు అందుతాయి. ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంటుంది.
మీనరాశి
ఈ రోజు చేపట్టే పనులలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులు, మిత్రుల నుంచి మంచి సలహాలు అందుతాయి. ఆర్థికంగా ఎదుగుతారు. దుర్గదేవిని పూజించడం మంచి ఫలితాలు ఇస్తాయి.