Horoscope Today: ఈ రాశివారికి ఈ రోజు చేపట్టే పనులు పూర్తవుతాయి.. ముఖ్యమైన కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
Horoscope 16 July 2021: ఆధునిక కాలం అంటూ మనిషి ఎంత ముందుకు వెళ్లినా ఈరోజుల్లో కూడా రాశిఫలాలను నమ్మి పనులు మొదలు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా..
Horoscope 16 July 2021: ఆధునిక కాలం అంటూ మనిషి ఎంత ముందుకు వెళ్లినా ఈరోజుల్లో కూడా రాశిఫలాలను నమ్మి పనులు మొదలు పెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా రోజును ప్రారంభించే ముందు మంచి చెడులను చూసి ముందుకు సాగుతారు. రాశిఫలాలను బట్టి.. ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. జూలై 16న రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి:
ఈ రాశివారికి ఈ రోజు పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. తోటి వారి సహకారం అందుకుంటారు. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం ఎంతో మేలు చేస్తుంది.
వృషభ రాశి:
శుభ కార్యాలయాల్లో పాల్గొంటారు. వ్యాపార విషయంలో మంచి జరుగుతుంది. శత్రువుల పై విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ఎంతో మేలు చేస్తుంటుంది.
మిథున రాశి:
ఈ రాశివారికిఈ రోజు సమస్యలు ఏర్పడే అవకాశాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడం మేలు జరుగుతుంది.
కర్కాకటక రాశి:
ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారాలు, ఇతర వాటిలో రాణించేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదైవాన్ని ప్రారంభించడం మేలు జరుగుతుంది.
సింహరాశి:
శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధాన మంచి ఫలితాలను ఇస్తుంది.
కన్యరాశి:
ఈ రాశివారు ఈ రోజు మంచి ఫలితాలు అందుకుంటారు. మానసిక ఆందాన్ని పొందుతారు. సంతోషకరమైన వార్త వింటారు. కుటుంబంలో మంచి గౌరవం పొందుతారు. ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.
తులరాశి:
ఈ రాశివారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చేసే పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్తలు వహించడం మంచిది. అమ్మవారి నామ స్మరణ మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రోజు చేసే పనులన్ని కలిసి వస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు మంచి జరుగుతుంది. సాయిబాబా పారాయణం వల్ల మంచి జరుగుతుంది.
ధనుస్సురాశి:
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పనులలో ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సుబ్రహ్మస్వామి దర్శనం మేలు చేస్తుంది.
మకరరాశి:
చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. కొన్ని కొన్ని విషయాలు మిమ్ములను ఉత్సాహపరుస్తాయి. దుర్గ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
కుంభరాశి:
చేపట్టే పనులను ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆంజనేయస్వామిని ఆరాధించడం మంచి జరుగుతుంది.
మీనరాశి:
అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి పారాయణం మేలు చేస్తుంది.