Horoscope Today: వారికి సాఫీగా ఉద్యోగ జీవితం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 13, 2024): మేష రాశి వారు ఈ రోజు కొందరు బంధుమిత్రులతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వృషభ రాశి వారిపై అధికారులకు నమ్మకం పెరిగి, మీ పనితీరు నచ్చి బాధ్యతలను పెంచుతారు. మిథున రాశి వారు పెరుగుతున్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారికి సాఫీగా ఉద్యోగ జీవితం.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 13th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 13, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 13, 2024): మేష రాశి వారు ఈ రోజు కొందరు బంధుమిత్రులతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వృషభ రాశి వారిపై అధికారులకు నమ్మకం పెరిగి, మీ పనితీరు నచ్చి బాధ్యతలను పెంచుతారు. మిథున రాశి వారు పెరుగుతున్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయానికి లోటుండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదాయాన్ని సద్వినియోగం చేసుకునే ఆలోచనలు కూడా చేస్తారు. కొందరు బంధుమిత్రులతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. గృహ, వాహన సౌకర్యాలను బాగా మెరుగుపరుచుకుంటారు. రాజకీయ వర్గాలు, ప్రభుత్వ వర్గాల్లో పలుకుబడి పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా మంచి ఫలితాలని స్తుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. వ్యక్తిగత సమస్యలకు చాలావరకు పరిష్కారం లభి స్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అధికారులకు మీ మీద నమ్మకం పెరిగి, మీ పనితీరు నచ్చి బాధ్యతలను పెంచుతారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితం విజయాలతో సాగిపోతుంది. క్షణికావేశాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. జీవనశైలి చాలావరకు మారిపోతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతో షాలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

పెరుగుతున్న ఆదాయాన్ని జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభి స్తాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాల స్థితిగతుల్లో కూడా మార్పు వస్తుంది. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు వరిస్తాయి. శుభ కార్యాల మీదా, పుణ్య కార్యాల మీదా ఖర్చులు బాగా పెరుగుతాయి. షేర్లు, చిన్న వ్యాపారాల్లో మదుపు చేయడం జరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బంధుమిత్రులను ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచడం మంచిది. సోదరులతో ఆస్తి వివాదం ఒక పట్టాన పరిష్కారం కాకపోవచ్చు. కొద్ది శ్రమతో ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, సరదాగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార బాధ్యతలను చేపట్టే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ఆదరణకు, ప్రోత్సాహానికి లోటుండదు కానీ, పనిభారం మాత్రం బాగా ఇబ్బంది పెడు తుంది. అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిక రంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిల్లల విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన అవసరాలు చాలావరకు తీరిపోతాయి. అయితే, అనవసర వ్యయాలు కూడా అధికంగానే ఉంటాయి. అదనపు ఆదాయాన్ని వీలైనంతగా జాగ్రత్త చేసుకోవడం మంచిది. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండడం అవ సరం. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. కుటుంబ జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనికీ ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకా శాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొద్ది శ్రమతో పిల్లలు ఘన విజ యాలు సాధిస్తారు. ఆహార, విహారాల్లో ఎంత .జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉంటారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా రాణిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధి స్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. తోబుట్టువులతో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉద్యో గంలో కొద్దిగా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా ఉన్నా ఆశిం చిన ప్రతిఫలం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం చేపట్టినా వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. కుటుంబ జీవితం హాయిగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో కూడా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగం సంతృప్తికరంగా పురోగతి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవ కాశం ఉంది. కొందరు బంధువుల వల్ల పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపా రాల్లో కూడా ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి. కొందరు మిత్రులతో ఆర్థిక వ్యవహారాలను పెట్టు కోకపోవడం మంచిది. ఇల్లు కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆశించిన శుభవార్త వింటారు.