AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: లక్కు అంటే వీరిదే.. ఒక్క రోజులో సుడి తిరుగుతుంది.. సోమవారం రాశిఫలాలు

ఉద్యోగ జీవితం పరవాలేదనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రతి వ్యవహారం లోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది.   ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయ త్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది.

Horoscope Today: లక్కు అంటే వీరిదే.. ఒక్క రోజులో సుడి తిరుగుతుంది.. సోమవారం రాశిఫలాలు
Daily Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 13, 2026 | 6:21 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వ్యక్తిగత జీవితంలో కొన్ని ప్రతికూలతలు తప్పకపోవచ్చు. కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతున్నా కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది.  వ్యాపారాల్లో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఇంటి విషయాల్లో జీవిత భాగస్వామి చేయూత లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగా నిలకడగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండదు. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం కలుగుతుంది. అష్టమ రాహువు కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవడం జరుగు తుంది. ఇంటా బయటా కొన్ని చికాకులుంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం కలిసి వస్తుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆహార, విహా రాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూలంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలోని వారికి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశీయానానికి, విదేశాలలో స్థిరపడడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అనుకోకుండా మంచి ధన యోగం పడుతుంది. సేవా కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. అనారోగ్య సమ స్యలుండే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా మారు తాయి. పెట్టుబడులు పెంచడానికి అవకాశముంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆదాయం పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీక రిస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సాయపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా పురోగమి స్తాయి. కుటుంబ సమస్యల మీద దృష్టి పెట్టడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఒకరిద్దరు బంధువులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆదాయం స్థిరంగా కొనసాగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. కొందరు చిన్ననాటి మిత్రులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. అధికార బాధ్యతలు పంచు కునే అవకాశముంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది. ఆదాయానికి, ఆరో గ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబసమేతంగా ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మిత్రుల వల్ల ఇబ్బందులుంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అధికారులకు బాగా ఉపయోగ పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగి పోతాయి. ఆస్తి వ్యవహారాలు సానుకూలమయ్యే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం పరవాలేదనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ప్రతి వ్యవహారంలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉంది.   ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన సమాచారం తప్పకుండా అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందు తుంది.  ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. సన్నిహితులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు అనుకోకుండా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

Follow Us