రాత్రి పూట కాఫీ తాగితే నిద్రకే కాదు.. మీ ప్రవర్తన  కూడా ఇలా మరిపోతుందట!

03 May 2026

TV9 Telugu

TV9 Telugu

చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. ప‌గటి పూట మాత్రమే కాకుండా రాత్రి కూడా కాఫీని తాగుతూ ఉంటారు. ఇలా రాత్రి సమయంలో కాఫీ తాగడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇది కేవలం నిద్రపై ప్రభావం చూపడమే కాకుండా ప్రవర్తనపై కూడా ప్రభావం చూపిస్తుంద‌ట

TV9 Telugu

కాఫీలో ఉండే కెఫీన్‌ శక్తివంతమైన ఉద్దీపక పదార్థం. ఇది మెదడులో నిద్రను ప్రోత్సహించే అడెనోసిన్ అనే రసాయనాన్ని నిరోధించి మేల్కొలుపును పెంచుతుంది. అందుకే రాత్రివేళ కాఫీ తాగితే నిద్రపోవడం కష్టమవుతుంది

TV9 Telugu

కానీ తాజా పరిశోధనలు ఈ ప్రభావం నిద్రకే పరిమితం కాదని సూచిస్తున్నాయి. ఈ అధ్యయనం ప్రకారం, రాత్రి సమయంలో కెఫీన్ తీసుకున్నప్పుడు ప్రవర్తన నియంత్రణ తగ్గే అవకాశం ఉంటుంద‌ని తేలింది

TV9 Telugu

పరిశోధకులు ఫ్రూట్ ఫ్లైస్‌పై చేసిన పరీక్షల్లో, రాత్రివేళ కెఫీన్ తీసుకున్న వాటిలో ఆలోచించకుండా స్పందించే స్వభావం ఎక్కువగా కనిపించిన‌ట్లు గుర్తించారు. అవి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ చర్యలను నియంత్రించలేకపోయినట్లు గమనించారు

TV9 Telugu

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇదే ప్రభావం పగటిపూట కెఫీన్ తీసుకున్నప్పుడు కనిపించలేదు. అంటే కాఫీ తాగే సమయం చాలా కీలకమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. మహిళల్లో ఈ ప్రభావం మరింతగా ఉంటుంద‌ని పరిశోధన సూచిస్తోంది

TV9 Telugu

హార్మోన్లు, మెటబాలిజం, మెదడు రసాయనాల వ్యత్యాసాల కారణంగా కెఫీన్ ప్రభావం మహిళల్లో వేరుగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇదే కారణంగా మహిళల్లో ఆత్రుత‌, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది

TV9 Telugu

కెఫీన్ మెదడులో డోపమైన్, నోరెపినెఫ్రిన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లను ఉత్తేజితం చేస్తుంది. ఇది దృష్టి కేంద్రీకరణకు సహాయపడినా, అధిక స్థాయిలో ఉంటే మెదడును అతిగా ఉత్తేజితం చేస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో శరీరం విశ్రాంతికి సిద్ధమవుతున్నప్పుడు ఇది సహజ రిథమ్‌ను దెబ్బతీస్తుంది

TV9 Telugu

నిద్రలేమి వల్ల నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ తగ్గిపోతాయి. ఈ పరిస్థితిలో కెఫీన్ కూడా తోడైతే, ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆర్థిక నిర్ణయాలు, డ్రైవింగ్, ఇతర ప్రవర్తనలపై కూడా ప్రభావం చూపిస్తుంది