SRH vs KKR IPL 2026 Result: సొంత గడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ ఘోర పరాజయం.. కేకేఆర్ దెబ్బకు డబుల్ హ్యాట్రిక్ మిస్
Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 165 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం కేకేఆర్ బ్యాటర్లు అజింక్య రహానే, రఘువంశీ, ఫిన్ ఆలెన్ (29) దూకుడుతో కేవలం 18.2 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు.

Sunrisers Hyderabad vs Kolkata Knight Riders Result, IPL 2026: ఐపీఎల్ 2026లో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ టీం ఘోర పరాజయం పాలైంది. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 165 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం కేకేఆర్ బ్యాటర్లు అజింక్య రహానే, రఘువంశీ, ఫిన్ ఆలెన్ (29) దూకుడుతో కేవలం 18.2 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేశారు. దీంతో వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచిన హైదరాబాద్ జట్టు డబుల్ హ్యాట్రిక్ విక్టరీ మిస్ చేసుకున 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా, ఈమ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం.
ఈక్రమంలో హైదరాబాద్ తరపున ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీ సాధించాడు. అతను 28 బంతుల్లో 61 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ కీలకమైన 42 పరుగులు చేశాడు. హెడ్, ఇషాన్ రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
కోల్‌కతా తరపున వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో అత్యధికంగా రాణించగా, సునీల్ నరైన్ మరియు కార్తిక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
రెండు జట్ల ప్లేయింగ్ 11..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఎషాన్ మలింగ.
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: అజింక్య రహానే(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ(కీపర్), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, అనుకూల్ రాయ్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
