AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

మే 3, 2026 ఆదివారం రోజున 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేషం, వృషభం, మిథున రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉండగా, కర్కాటకం నుంచి సింహం వరకు ఆర్థిక పురోగతి, శుభవార్తలు లభించే సూచనలు ఉన్నాయి. కన్య, తుల రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి బాధ్యతలు పెరిగినా లాభాలు కూడా ఉంటాయి. మకరం, కుంభం, మీన రాశుల వారికి రోజు సానుకూలంగా సాగి, ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా సంతృప్తి లభించే అవకాశాలు ఉన్నాయి.

Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashifal In Telugu 03 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 3, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృషభ రాశి వారి ఆదాయం, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి…

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా సానుకూల సమాచారం అందుతుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం, ఆరోగ్యం ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఆశించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు తీసుకుని లబ్ధి పొందుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. వాహన యోగం కలుగుతుంది. విదేశాల నుంచి తగిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మీరు చేపట్టే మార్పులు, చేర్పులు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. ఒకటి రెండు అదనపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంవారు లాభాల పంట పండించు కుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగంలో ఒకటి రెండు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు సరిపడ డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. కుటుంబంలో కొందరితో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలను విస్తరించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి ధనం వసూలవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఇంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో ప్రమోషన్ మీద బదిలీకి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి ఒత్తిడికి గురవుతారు. ఆదాయం పెరిగినప్పటికీ అంతకు మించి ఖర్చులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను అత్యవసరంగా చక్కబెడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీ అవుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ సంబంధ మైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా పురోగమిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు తామున్న ఊరిలోనే ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలకు వెళ్లే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. కొత్త పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఏ వృత్తి అయినప్పటికీ తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం తల పెడతారు. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ వాగ్దానాలు ఉండవద్దు.

Follow Us