Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు..

దిన ఫలాలు (ఫిబ్రవరి 8, 2024): మేష రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు..
Horoscope Today 08th February 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 08, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఫిబ్రవరి 8, 2024): మేష రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త పనులు, కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సమాజంలో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి వివాదం ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. బంధువులతో కొద్దిగా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయో జనం పొందుతారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలు వేగంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. దగ్గర బంధువుల రాకపోక లుంటాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెడతారు. పెద్దల నుంచి సహాయ సహకారా లుంటాయి. వ్యక్తిగత సమస్యలను పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదా యం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులకు బాగా ఉపయోగపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యూహాలతో వ్యాపారాలు పురో గతి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. కొందరు స్నేహితులు ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తారు. ఆరో గ్యం బాగానే ఉంటుంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులూ ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు గడిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టుల్ని లేదా బాధ్యతల్ని చేపట్టాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సమయా నికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలను, సమస్యలను అధిగమించి, లాభాలు గడి స్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని అత్యవసర వ్యక్తిగత పనులు పూర్తి చేసి ఊరట చెందుతారు. ఏ విషయంలోనైనా యత్న కార్యసిద్ధి ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమలు సాఫీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే, ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలు తెస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపారాలో నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన వ్యవహారాలు, పనులు, కార్యకలాపాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. మంచి గుర్తింపు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న పాటి వివాదాలకు అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా ఉంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

పెళ్లి ప్రయత్నాలు సఫలమై, ఆశించిన పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఇష్టమైన వారితో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మంచి పరిచ యాలు ఏర్పడుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావ కాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. ప్రేమల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ముఖ్యంగా వృత్తి జీవితంలో తీరిక ఉండదు. ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహా రాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయ త్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలుంటాయి. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!