Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (8-02-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. నేడు ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Feb 08, 2022 | 6:28 AM

Horoscope Today (8-02-2022): రోజులో ఏ పని మొదలు పెట్టాలన్నా వృత్తి , ఉద్యోగ, వ్యాపార ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా సరే తమకు ఈరోజు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల(Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 8వ తేదీ ) గురువారం రాశి ఫలాలు(Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం

కార్యానుకూలత ఉంది. సంఘటనలు ఉత్సాహాన్నిఇస్తాయి. అనవసర ఆలోచనల్ని దరిచేరనీయకండి. మూలధనం తాలూకు సరైన పెట్టుబడి గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యంగా కళాకారులకు ఈ రోజు చాలా మంచిది.

వృషభం

ఈ రాశి వారు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బద్ధకించకుండా పనిచేస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సహనాన్ని కోల్పోకండి.

మిథునం

నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన ఉంది. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది. కలిసి పనిచేసే వారి నుండి మీరు ఆనందాన్ని పొందుతారు.

కర్కాటకం

ఈ రాశి వారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈ రోజు హనుమాన్ చాలీసా చదవండి. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహం

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం గురించి మీరు చాలా భావోద్వేగంగా ఉండవచ్చు.

కన్య

ఈ రాశి వారు బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.ఈ రోజు సామాజిక సేవ చేస్తున్న పిల్లవాడిని చూసి మనసులో ఆనందం కలుగుతుంది.

తుల

ఆశయాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు,మిత్రులతో కలిసి చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎక్కువ సమయం అభివృద్ధి కోసం కేటాయించడం మంచిది. విద్యార్థులకు మంచి రోజు. ఈ రోజు, మీరు ఇంట్లో ఏది దాచడానికి ప్రయత్నించినా, అది వివాదానికి కారణం కావచ్చు.

వృశ్చికం

ఒక ముఖ్య వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులలో ఊహించని ఫలితాలు వెలువడతాయి. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది.

ధనుస్సు

మనోబలంతో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. గిట్టనివారి మాటలను పట్టించుకోకండి. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం. మీరు ఒక కవిత లేదా కథ రాయవచ్చు.

మకరం

స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగండి. సత్ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో సానుకూల ఫలాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోండి అంతా మంచే జరుగుతుంది. శివుడిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కుంభం

ఈ రాశి వారు మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. మీరు మీ వృత్తి జీవితంతో పాటు మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి శ్రద్ధ వహించాలి.

మీనం

కాలాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా ముందుకు సాగుతారు. ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల అభిప్రాయం ముఖ్యం.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)