Horoscope Today: ఆ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (అక్టోబర్ 7, 2024): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. మిథున రాశి నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 07th October 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 07, 2024 | 5:01 AM

దిన ఫలాలు (అక్టోబర్ 7, 2024): మేష రాశి వారు ఈ రోజు ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఆదాయం మరింతగా పెరుగుతుంది. మిథున రాశి నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అధికారుల ఆదరణ పెరుగు తుంది. ముఖ్యమైన ప్రయత్నాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. బంధుమిత్రుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం చాలావరకు బాగుంటుంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఆఫర్లు వస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

చేపట్టిన పనులన్నిటిలో విజయం కలుగుతుంది. ఇల్లు కొనుగోలు వ్యవహారం పూర్తవుతుంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగా వకాశాలు లభిస్తాయి. ధన సంబంధమైన వ్యవహారాలు, ప్రయత్నాల్లో విజయాలు లభిస్తాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కీలక వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలరీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయం నిలకడగా సాగుతుంది. ఖర్చులు ఎక్కు వవుతాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు చాలావరకు సంతృప్తికరంగా పూర్తవు తాయి. బంధు వులతో వివాదాలు కలుగుతాయి. వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం, ప్రోత్సా హం లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సకాలంలో ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వినడం జరుగుతుంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలవికాని లక్ష్యాలతో విశ్రాంతి కరువవుతుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. మొండి పట్టుదలతో ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. పిల్లల విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా ఫలి స్తాయి. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. బంధుమిత్రులకు అవసరమైన సహాయ సహ కారాలు అందిస్తారు. కుటుంబ వాతావారణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. భారీగా గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారపరంగా తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు బాగా ఉపయోగపడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగు తాయి. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఆరోగ్యానికి భంగం ఉండదు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలను అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు, స్థాన చల నాలు తప్పకపోవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు, కార్యక్రమాలు నిరాటంకంగా పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయా ణాల వల్ల లాభం ముంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారుల అంచనాలకు తగ్గట్టుగా బాధ్యతలు నిర్వ ర్తిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు తగ్గ లాభాలు గడిస్తారు. దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులు నూతన అవకాశాలు పొందుతారు. అనుకున్న సమయా నికి అనుకున్న విధంగా పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్ర త్తగా ఉండడం మంచిది. కుటుంబపరంగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి, అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. వ్యాపా రాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ముఖ్యమైన పనుల్లో అవాంత రాలు, ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగు తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తగ్గ ఫలితం కనిపి స్తుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. మిత్రులతో అపార్థాలు కలుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందు తుంది. ఆదాయాన్ని మించి ఖర్చులుంటాయి. ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించడం మంచిది.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్