Horoscope Today: బంధువులతో మాట పట్టింపులు.. ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక లాభాలు

Subhash Goud

Subhash Goud |

Updated on: Sep 06, 2021 | 4:56 AM

Horoscope Today: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతి..

Horoscope Today: బంధువులతో మాట పట్టింపులు.. ఆకస్మిక ప్రయాణాలు.. ఆర్థిక లాభాలు

Follow us on

Horoscope Today: నిత్యం మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ఊహించనిరీతిలో జీవితం ప్రమాదంలో పడుతుంది. అందుకే తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యంలోనూ ఆచితూచి, సమయానుకూలంగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. సోమవారం పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి అనుకూలంగా లేవు. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:

ధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

వృషభ రాశి:

గ్రహబలం అనుకూలంగా లేదు. కొన్ని విషయాలు మానసికంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు.

మిథున రాశి:

ముఖ్యమైన పనులు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థికంగా లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

కర్కాటక రాశి:

అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుంది. అధికంగా ఒత్తిడికి గురవుతారు.

సింహ రాశి:

అనుకులమైన ఫలితాలు ఉంటాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ఇతరుల సహాయం పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు బాగుంటుంది.

కన్య రాశి:

ఆశించిన ఫలితాలు పొందుతారు. చేపట్టే పనులలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి.

తుల రాశి:

ముఖ్యమైన విషయాలలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.

వృశ్చిక రాశి:

అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులతో సంతోషాన్ని పంచుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు రాశి:

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆశించిన ఫలితాలు రావడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. మకర రాశి:

మకర రాశి:

పట్టుదలతో ముందుకు వెళితే విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి. అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.

కుంభ రాశి:

పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో ముందుకు సాగుతార. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి:

ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu