AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది..

Horoscope Today (October 04-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు.

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది..
Weekly Horoscope
uppula Raju
|

Updated on: Oct 04, 2021 | 5:55 AM

Share

Horoscope Today (October 04-10-2021): ఈరోజులో కొత్తపనిని మొదలు పెట్టాలన్నా , శుభకార్యాలు మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు చాలామంది ఉన్నారు. జాతకాలను విశ్వసిస్తూ పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది ఈరోజు తమ జాతకం ఎలా ఉంది అంటూ.. తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 4న ) సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీరు వ్యాపారం చేస్తుంటే కొన్ని నూతన మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది.

వృషభ రాశి: నేడు ఈ రాశివారికి కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రుడు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. చుట్టుపక్కల వారు మీకు సహకరిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశి వారు ఆగిపోయిన కార్యాలు పూర్తి చేసుకుంటారు. నూతన విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశముంది. సాయంత్రం వాహనానికి సంబంధించిన ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి.

కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. తెలివితేటలతో నూతన కార్యాలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. మీరు ఇతరుల లోపాలను వెతకడం మానేస్తే మంచిది.

సింహరాశి: ఈ రోజు ఈ రాశివారికి లాభాలు ఉంటాయి. కీర్తి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. అవసరమైన వారికి సహయంగా ఉంటారు. వాక్చాతుర్యం, సమర్థతతో ఇతరులను తమ వైపునకు ఆకర్షిస్తారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి.

కన్యా రాశి: ఈ రోజు ఈ రాశివారికి ఖర్చులు అధికం. సాయంత్రం నుంచి రాత్రి వరకు అనవసరమైన ఖర్చులు తెరపైకి వస్తాయి. కోరుకోపోయినప్పటికీ బలవంతంగా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.

తులారాశి: ఈ రోజు తులా రాశివారికి సమాజం నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగం చేస్తే మీ హక్కులు పెరుగుతాయి. అంతేకాకుండా బాధ్యత కూడా పెరుగుతుంది. మీ ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తారు. వీలైనంత వరకు ఎవ్వరితోనూ వివాదాలు పెట్టుకోకపోవడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రోజు ఈ రాశివారు కడుపు సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశముంది. అనవసరమైన ఖర్చుల వల్ల బాధపడతారు. సాయంత్రం కొన్ని శుభవార్తలు అందుకుంటారు. ఫలితంగా మీలో ఉత్సాహం పెరుగుతుంది. రాత్రి సమయంలో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశముంది.

ధనస్సు రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. మీ రాశి నుంచి మొదటి పాదంలో ఉన్న బృహస్పతి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశముంది. ఆహార, పానీయాలపై ప్రత్యేక నియంత్రణ కలిగి ఉండండి. ఆరోగ్యం గురించి తెలుసుకోండి.

మకరరాశి: ఈ రోజు ఈ రాశివారు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భగవంతునిపై మనస్సు లగ్నం చేస్తారు. ఈ రోజు మీకు అదృష్టం 69 శాతం కలిసి వస్తుంది.

కుంభ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు. మీ మంచి పనులు కుటుంబం పేరును పెంచుతాయి. పెద్దల ఆశీస్సులతో మీరు పనిలో విజయం సాధిస్తారు. సాయంత్రం సమయంలో సంగీతం, విహారయాత్రలతో గడుపుతారు.

మీనరాశి: ఈ రోజు ఈ రాశివారు ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ఇది మీ పిల్లలు, జీవిత భాగస్వామిపై ప్రభావం చూపుతుంది. ఆకస్మిక ఆందోళనకు గురయ్యే అవకాశముంది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యంతో ప్రశంసలు అందుకుంటారు. సందర్శకులను ఆకర్షించడంలో విజయం సాధిస్తారు.