Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 1, 2024): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 01st August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 01, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 1, 2024): మేష రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగాల్లో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో సొంత ఆలోచనలు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. రాదను కున్న డబ్బు చేతికి అందుతుంది. బాకీలన్నీ చాలావరకు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గ ఖర్చు లుంటాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదానికి పరిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. శుభకార్యాల విషయంలో బంధువుల సహాయ సహకా రాలు లభిస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో కూడా రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తోబు ట్టువుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగంలో అన్ని రకాల బాధ్యతల్ని సమర్థవంతంగాపూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యానికి లోటుండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

అనుకున్న పనులన్నీ సకాలంలో, సవ్యంగా పూర్తవుతాయి. మంచి స్నేహాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా సంయమనం పాటించాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిల కడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలుంటాయి. అదనపు బాధ్యతల ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆదాయం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కానీ, అనవసర ఖర్చుల భారం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో బాగానే లాభా లను గడించగలుగుతారు. బంధుమిత్రులతో అనవసర వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యలు, కష్టనష్టాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయా ణాల్లో వల్ల ఇబ్బందులు పడతారు. ఇంటా బయటా పనిభారం ఎక్కువగానే ఉంటుంది. పెండింగ్ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో శ్రమాధిక్యత ఉన్నా ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం పెరుగుతుంది. వ్యాపా రాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు ఊపందుకుంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. బంధువులతో అనుకోకుండా అపార్థాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తి వ్యవహారాల మీద దృష్టి కేంద్రీ కరిస్తారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుం టారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహా రాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఇంటా బయటా దాదాపు ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఏ ప్రయత్నమైనా సకాలంలో, సంతృప్తికరంగా నెరవేరుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగిపోతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. ఆధ్యా త్మిక చింతన పెరిగి, కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులకు మీ పనితీరు సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగిపోతాయి. ఇంటా బయటా పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకుంటారు. ఇష్టమైన బంధువులతో విందులో పాల్గొంటారు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఉచిత సహాయా లకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వ్యవహారాలన్నీ సానుకూలంగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శన చేసుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో బయటపడతారు. కొందరు బంధుమిత్రుల ఆర్థికంగా నష్ట పోయే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయ ప్రయత్నాలు నిదానంగా నెర వేరుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!