Horoscope Today: ప్రయాణాల విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి.. అతివేగం అస్సలు వద్దు.. సోమవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈ రాశి ఫలాల ఆధారంగా...
Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈ రాశి ఫలాల ఆధారంగా ఎవరు ఎలాంటి పనులు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం. సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూసేయండి..
మేష రాశి:
మేష రాశి వారు ఈరోజు స్నేహితుల నుంచి, దగ్గర వ్యక్తుల నుంచి కొన్ని ముఖ్యమైన ఆహ్వానాలను అందుకుంటుంటారు. ఈ రాశి వారికి శ్రీవెంకటేశ్వర స్వామి వారి అర్చన ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
వృషభ రాశి:
ఈ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు సాధించడంలో పెద్దవారి సహకారం అవసరం ఉంటుంది. వీరికి మహా గణపతి దర్శనం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈరోజు వాహన సంబంధిత ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. విష్ణు సహస్త్ర నామ పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశివారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతాయి. శివ పంచాక్షరి జపం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
సింహ రాశి:
సిహరాశి వారు ఈరోజు సౌకర్యాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు నడిపే వారి విషయాల్లో అతివేగం పనికిరాదు. సుదర్శన స్వామి వారి నామ స్మరణ ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
కన్య రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే పెద్దవారికి కలుసుకునే అవసరం ఏర్పడుతుంటుంది. దుర్గా సప్త శ్లోకి పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
తుల రాశి:
తుల రాశి వారు ఈరోజు అనుకున్న పనుల్లో ఒత్తిడి ఎదుర్కొంటుంటారు. మాట విలువ కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారి అర్చన ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు. పలు రకాల విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆంజనేయ స్వామి దండక స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఈరోజు తీవ్రమైన శ్రమ ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణు పంజరి స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మకర రాశి:
ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఎదురయ్యే కొన్ని చికాకులను అధిగమించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి రావాల్సిన బాకీలు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక సేవ క్యార్యక్రమాల్లో పాల్గొంటారు. శివ పంచాక్షరి జప స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మీన రాశి:
ఈ రాశి వారు ఈరోజు అనవసరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు పాటించడం మంచిది. మహాగణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
Also Read: జమ్మూలో శ్రీవారి ఆలయం.. 62 ఎకరాలు మంజూరు.. ఆమోదం తెలిపిన జమ్మూ – కశ్మీర్ పరిపాలనా మండలి..
Color Changing Shiva Linga: అమావాస్యకు బూడిద రంగులో..పౌర్ణమికి గంధం రంగులో దర్శనమిచ్చే శివుడు..
Tirumala: తిరుమల వేంకటేశుని సన్నిధిలో ప్రధానార్చకులుగా తిరిగి రమణ దీక్షితులు: అసలేం జరిగింది?