Horoscope Today: ఈరోజు ఏ రాశి వారు వాహన ప్రయాణంలో, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే..!

Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో...

Horoscope Today: ఈరోజు ఏ రాశి వారు వాహన ప్రయాణంలో, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే..!
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Apr 06, 2021 | 7:16 AM

Horoscope Today: రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు మనలో చాలా మంది ఉంటారు. ఈరోజు మంగళవారం (ఏప్రిల్ 6) ఈ రాశి ఫలాల ఆధారంగా ఎవరు ఎలాంటి పనులు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశి వారు ఈరోజు ఆర్ధిక ప్రగతిని సాధించుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు స్థిరచరాస్థి క్రయవిక్రయాల్లో అభివృద్ధి ప్రారంభమవుతుంది. అనుకూలమైన కార్యక్రమాలు చేపడతారు. గోసేవ చేసుకోవడం ఈ రాశివారికి చాలా మంచిది.

మిథున రాశి: మిథున రాశి వారు ఈరోజు శ్రమ ఓర్చి పనులు చేపడుతుంటారు. రావాల్సిన బాకీలు కొంత ఆలస్యమవుతుంటాయి. నవగ్రహస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చేసేటటువంటి ఆలోచనలు కూడా కలిసివస్తుంటాయి. పేదవారికి అన్నవస్త్రదానం చేసుకోవడం మంచిది.

సింహ రాశి: సిహరాశి వారు ఈరోజు వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహారవిరాధుల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించరాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం వారికి మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన బాకీల్లో కొంత ఆలస్యం అవుతాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ రాశి వారికి విష్ణు స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తుల రాశి: ఈ రాశివారికి ఈరోజు ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన చేయడం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఆర్ధిక పరిస్థితులు నిరాశ కలిగిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గౌరీ శంకరుల ఆరాధన శుభఫలితాలను కలుగజేస్తుంది.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారు ఈరోజు షేర్స్ , పెట్టుబడుల విషయంలో ఏ మాత్రం కూడా తొందర పడకూడదు. రావాల్సిన బాకీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు విందు వినోదం ఉంటాయి. పెద్దవారిని కలుసుకుంటారు. ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటారు. విష్ణు పూజ మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు విందు వినోదం వంటి కార్యక్రమాల్లో కొంత పరిధిని దాటి ఖర్చు చేస్తుంటారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వెంటకటేశ్వర స్వామికి వడపప్పు పానకం నివేదన చేయడం మేలు చేస్తుంది. .

మీన రాశి: ఈ రాశి వారికీ ఈరోజు ఆర్ధిక పరిస్థితులు నిరాశకలిగిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో చిన్న చిన్న ఆలస్యం కూడా జరుగుతుంది. మహాగణపతి దర్శనం మేలు చేస్తుంది.

Also Read: ఆకట్టుకునే ఫీచర్లతో సామ్‌సంగ్‌ రెడు కొత్త ఫోన్లు.. తక్కువ ధరకే అందుబాటులో..

శంషాబాద్‌ విమానాశ్రయంలో వీర జవానుకు నివాళులు అర్పించిన సీపీ సజ్జనార్‌

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?