1/5

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ సామ్‌సంగ్ తాజాగా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
2/5

గ్యాలాక్సీ ఎఫ్ సిరీస్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు అందుబాటులో ఉండడం విశేషం.
3/5

గ్యాలాక్సీ F12, గ్యాలాక్సీ F02S మోడళ్లను భారత్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.
4/5

గ్యాలక్సీ F12 ఫీచర్ల విషయానికొస్తే.. 48 మెగా పిక్సెల్ క్వాడ్ కెమెరా, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 6000 MAH బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 10,999గా ఉంది. ఇంటర్నల్ మెమొరీ, ర్యామ్ ఆధారంగా ఫోన్ ధరలు మారుతాయి.
5/5

ఇక గ్యాలక్సీ F02Sలో 5000 MAH బ్యాటరీ, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫిటీ వీ డిస్‌ప్లే వంటి ఫీచర్లున్నాయి. దీని ప్రారంభ ధర రూ. 8,999గా ఉంది. ఇంటర్నల్ మెమొరీ, ర్యామ్ ఆధారంగా ఫోన్ ధరలు మారుతాయి.