AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mars 2020: ఏప్రిల్ 11 కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న శాస్త్రవేత్తలు.. ఎందుకో తెలుసా..?

దాదాపు 47 కోట్ల కిలోమీటర్లు నాసా పర్సీవరెన్స్‌ రోవర్‌తో పాటు ప్రయాణించిన ఈ మినీ హెలికాప్టర్.. రోవర్‌ను వీడి మార్స్‌ ఉపరితలంపై అడుగు పెట్టింది.

Shiva Prajapati
|

Updated on: Apr 05, 2021 | 10:16 PM

Share
 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో విజయం సాధించింది. నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ ఇన్‌జెన్యూయిటీ మార్స్‌పై దిగింది.

1 / 8
దాదాపు 47 కోట్ల కిలోమీటర్లు నాసా పర్సీవరెన్స్‌ రోవర్‌తో పాటు ప్రయాణించిన ఈ మినీ హెలికాప్టర్.. రోవర్‌ను వీడి మార్స్‌ ఉపరితలంపై అడుగు పెట్టింది.

దాదాపు 47 కోట్ల కిలోమీటర్లు నాసా పర్సీవరెన్స్‌ రోవర్‌తో పాటు ప్రయాణించిన ఈ మినీ హెలికాప్టర్.. రోవర్‌ను వీడి మార్స్‌ ఉపరితలంపై అడుగు పెట్టింది.

2 / 8
మార్స్‌ అన్వేషణ కోసం నాసా ప్రయోగించిన పర్సీవరెన్స్ రోవర్ గత నెల ఫిబ్రవరి 18వ తేదీన మార్స్‌పై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పర్సీవరెన్స్ రోవర్ కింది భాగంలో ఇన్‌జెన్యూయిటీ మినీ హెలికాప్టర్‌ను కూడా ఫిక్స్ చేశారు.

3 / 8
ఇంతకాలం పర్సీవరెన్స్ పవర్ సిస్టమ్‌ను ఉపయోగించుకున్న ఈ మినీ హెలికాప్టర్.. ఇక మీదట సొంత బ్యాటరీ సాయంతో నడవాల్సి ఉంటుంది.

4 / 8
ఇంజెన్యూయిటీ మినీ హెలికాప్టర్‌ ఈనెల 11వ తేదీన ఎగిరే ప్రయత్నం చేయనుంది. అయితే, ఈ ప్రయత్నం కూడా చాలా రిస్క్‌తో కూడిన పని అని సైంటిస్ట్‌లు చెబుతున్నారు.

5 / 8
అంగారక గ్రహంపై రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటి వాతావరణంలో ఈ మినీ హెలికాప్టర్ తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.

6 / 8
భూమి సాంద్రతలో కేవలం ఒకశాతం మాత్రమే మార్స్ సాంద్రత ఉంటుంది. ఈ కారణంగా హెలికాప్టర్ ఎగరడం అంత సులువు కాదు. అయితే, గురుత్వాకర్షణ విషయంలో మాత్రం హెలికాప్టర్ ఎగిరేందుకు సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. భూమి గురుత్వాకర్షణ శక్తిలో, మార్స్ గురుత్వాకర్షణ శక్తి కేవలం మూడో వంతు మాత్రమే కావడం.. ఈ హెలికాప్టర్ ఎగిరేందుకు సహకరిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

7 / 8
హెలికాప్టర్ విజయవంతంగా ఎగిరినట్లయితే.. శాస్త్రవేత్తలు మరో ఘన విజయాన్ని సాధించినట్లే అవుతుంది. మార్స్ వాతావరణంలో సంచరిస్తూ ఆ గ్రహం ఉపరితలాన్ని చిత్రించవచ్చు.

8 / 8