- Telugu News Photo Gallery Science photos Mars 2020 did nasa perseverance rover capture a rainbow on mars pic viral
NASA Perseverance Rover: అంగారక గ్రహంపై ఆసక్తికర దృశ్యం.. క్లిక్‌మనిపించిన నాసా పర్సీవరెన్స్ రోవర్.. మీరూ చూసేయండి..
NASA Perseverance Rover: అంగారక గ్రహంపై ఆసక్తికర దృశ్యం.. క్లిక్‌మనిపించిన నాసా పర్సీవరెన్స్ రోవర్.. మీరూ చూసేయండి..
Shiva Prajapati | Edited By: Ravi Kiran
Updated on: Apr 08, 2021 | 8:02 AM

భూమిపై ‘ఇంద్రధనస్సు’ ఏర్పడటం సర్వ సాధారణం. అందమైన ‘ఇంద్రధనస్సు’ను ఎన్నోసార్లు మనం చూసుంటాం. మరి ఇతర గ్రహాలపై ఏర్పడే ‘ఇంద్రధనస్సు’ను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూడండి.

మార్స్ అధ్యయనం కోసం నాసా పంపిన పర్సీవరెన్స్ రోవర్.. అద్భుతమై దృశ్యాన్ని తన కెమెరాలో బంధించింది. భూమిపైనే కాదు.. అంగారకుడిపైనా ఇంద్రధనస్సు ఏర్పడుతుందని ప్రపంచానికి చాటి చెప్పింది.

ఇంద్రధనుస్సు ఏర్పడటం.. వర్షం రాకకు సూచనగా భావిస్తారు. ఆ నేపథ్యంలోనే మార్స్‌పైనా వర్షాలు కురుస్తాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ క్రమంలో నాసా సైటింస్ట్‌లు కూడా తమ పరిశోధనల్లో వేగం పెంచారు.

భూమికి సమీపంగా ఉండి.. దాదాపు భూమిని పోలి ఉన్న అంగాకర గ్రహంపై జీవి ఉనికి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మార్స్‌పై అధ్యయనానికి వరుస ప్రయోగాలు చేపడుతున్నాయి. చాలా దేశాలు ఉపగ్రహాలను పంపించి మార్స్‌ను అధ్యయనం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

అంగారక గ్రహంపై విజయవంతంగా దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్.. ఆ గ్రహానికి సంబంధించిన అనేక రహస్యాలను చేధించడం బిజీ బిజీగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే అనేక ఫోటోలను పంపిన రోవర్.. తాజాగా మార్స్‌పై ఇంద్రధనుస్సు ఏర్పడటాన్ని గుర్తించింది. దానికి సంబంధించిన ఫోటోను కూడా నాసా కేంద్రానికి పంపించింది.

శాస్త్రవేత్తల ప్రకారం.. మార్స్‌పై వర్షం పడే అవకాశం లేదు. అందుకని, ఈ ఇంద్రధనస్సుని శాస్త్రవేత్తలు ‘డస్ట్‌బౌ’ గా భావిస్తున్నారు. అంటే నీటి బింధువులకు బదులుగా.. దుమ్ము, దూళి వల్ల ఈ ధనస్సు ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తల భావన.

ఇక్కడ మరో ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కెమెరాలో చూపినట్లుగా రెయిన్‌బో ఉండకపోవచ్చంటున్నారు. కాంతి కిరణాలు కెమెరా లెన్స్‌పై పడటంతో ఆ కిరణాలు విచ్చిన్నం చెంది ఇలా కనిపించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

‘డస్ట్‌బౌ’ వినడానికి మనందరికీ కొత్త అయినప్పటికీ.. మార్స్‌కు మాత్రం కొత్తేం కాదు. మార్స్‌పై ఎక్కువగా ‘ఐఎస్‌బౌ’లు ఏర్పడుతుంటాయి. 2015లో నాసా ‘ఏదైనా అడుగొచ్చు’(ఆస్క్ మి ఎనీథింగ్) అనే కార్యక్రమం నిర్వహించిన సందర్భంలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. 1990లో పాథ్‌ఫైండర్ మిషన్ సందర్భంలోనే మార్స్‌పై ‘ఐస్‌బౌ’ను తొలిసారి కనుగొన్నట్లు నాసా వెల్లడించింది.





























