Horoscope Today: ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..

Horoscope Today 4-04-2021: జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో..

Horoscope Today: ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి..
Today Horoscope
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 04, 2021 | 10:47 AM

Horoscope Today 4-04-2021: జ్యోతిష శాస్త్రంలో 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషము, మీనము మొదలగు రాశులు. ఈ రాశి ఫలితాలను ప్రజలు చాలా మంది విశ్వసిస్తారు, అనుసరిస్తుంటారు. రాశి ఫలాలను ఆధారంగా చేసుకుని రోజును ప్రారంభించే వారు కూడా ఉంటారు. ఈ రాశి ఫలాల ఆధారంగా ఎవరు ఎలాంటి పనులు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం. ఈ ఆదివారం రాశి ఫలాలను ఒకసారి చూద్దాం..

మేష రాశి: ఈ రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో పెద్దవారి సహకారం తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంటుంది. అంతేకాకుండా సామాజిక, గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఇవాళ వేరు వేరు రూపాల్లో పలు కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేసే సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. సుదర్శన స్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది.

మిథున రాశి: ఈ రాశి వారికి ఇవాళ వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తొందరపడి చేపట్టినటువంటి పనులు పూర్తి చేయకుండా ప్రయోజనాల పరంగా ఆలోచించటం మంచిది. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఇవాళ తమకున్నటువంటి ఆస్తి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయాణం మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఇవాళ ప్రముఖులతో పరిచయాలు అవుతుంటాయి. అలాగే విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. ధన్వంతరి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశి వారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. నవగ్రహ స్తోత్ర పారాయణం వీరికి మేలు చేస్తుంటుంది.

తుల రాశి: ఈ రాశికి ఇవాళ శ్రమకు తగినటివంటి ప్రయోజనాలు పొందటంలో పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. నిరాశ, నిస్పృహలను దూరం చేసుకోవాలి. శివపంచాక్షరి జపం వీరికి మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి సంఘంలో అభిమానులు, అనుచరుల సంఖ్య తగ్గిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. అలాగే రాజకీయపరమైన కార్యక్రమాల్లో అతి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. సూర్యనారాయణ స్వామి అర్చన, దర్శనం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఉద్యోగాది విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణ పరంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నందీశ్వరుడి దర్శనం, అర్చన మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు ఇవాళ ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారి అర్చన వీరికి మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఇవాళ తమకు కలిగినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపం దాల్చుకునేందుకు తగినటువంటి శ్రద్ధ చూపటం మంచిది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శివాభిషేకం మేలు చేస్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి ఇవాళ వ్యాపారంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపటం మంచిది. హయగ్రీవ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Horoscope Video:

Also read:

Corona Vaccination: హెల్త్ వర్కర్లు..ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వాక్సిన్ కోసం ఇకపై కొత్తగా ప్రత్యేక రిజిస్ట్రేషన్లు లేవు: కేంద్రం ప్రకటన

అమెరికా క్యాపిటల్‌ భవనం తాత్కాలికంగా మూసివేత.. 6 వరకు వైట్‌హౌస్‌లో జాతీయ జెండాను అవనతం చేయాలని బైడెన్‌ ఆదేశం

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!