Horoscope 2023: కొత్త ఏడాదిలో కర్కాటక రాశి రాజకీయ నేతల జీవితంలో శని, గురువు ప్రభావంతో పెను మార్పులు.. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే..
ఈ సంవత్సరం జనవరి 17న శని రాశి తన రాశి గమనాన్ని మార్చుకోనుంది. దీంతో శని కర్కాటక రాశిలో ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు.. దీని కారణంగా శని ప్రభావం ఈ రాశివారిపై ప్రారంభమవుతుంది.
2023 సంవత్సరం కర్కాటక రాశి వారికి గొప్ప సంవత్సరం అని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ఈ రాశివారి జీవితంలో కొత్త సంవత్సరం పెను మార్పులను తీసుకుని వచ్చే అవకాశం ఉందని.. దీంతో గొప్పగా గడుస్తుందని చెప్పారు. ఏప్రిల్‌లో దేవగురు బృహస్పతి ఈ రాశివారికి అదృష్టాన్నితీసుకుని వస్తుంది. ప్రతి పనిని విజయవంతం చేస్తుంది. ఈ సంవత్సరం జనవరి 17న శని రాశి తన రాశి గమనాన్ని మార్చుకోనుంది. దీంతో శని కర్కాటక రాశిలో ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు.. దీని కారణంగా శని ప్రభావం ఈ రాశివారిపై ప్రారంభమవుతుంది. ఇది కాకుండా.. ఈ సంవత్సరం రాహు-కేతువుల మార్పు కర్కాటక రాశిలో అనేక మార్పులను చూపుతుంది.
కొత్త సంవత్సరం రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మొత్తంమీద, కర్కాటక రాశి వారికి సంవత్సరం పొడవునా అదృష్టాన్నికలిగించే ఎటువంటి పరిస్థితులను బృహస్పతి విడిచి పెట్టడు. మరోవైపు, రాహువు కారణంగా, ప్రతికూల పరిస్థితుల్లో ఈ రాశివారు పనితీరు అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశిఫలం 2023: వృత్తి ఈ సంవత్సరం ఉద్యోగులకు అపారమైన విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. జీతంలో పెరుగుదల ఉంటుంది. వ్యాపారులకు ఈ సంవత్సరం పూర్తి లాభాలతో ఉంటుంది. ఈ రాశివారు ధన లాభాల కోసం అద్భుతమైన అవకాశాలను పొందుతారు.
కర్కాటక రాశిఫలం 2023: ఆర్థిక స్థితి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం. ఆర్థిక పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. మీ రాశిలో శని అష్టమ స్థానములో ఉండడంతో మంచి లాభాలు కలుగుతాయి. సంవత్సరం మధ్యలో .. చివరిలో ఆకస్మిక ధనలాభం పొందే సూచన ఉంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలను పొందవచ్చు. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పెట్టుబడికి సంబంధించి ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే, ఈ సంవత్సరం భూమి, ఇంటిపై పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశిఫలం 2023 : కుటుంబ జీవితం రాహు-కేతువు ఈ సంవత్సరం మీ వైవాహిక , కుటుంబ జీవితంలో కల్లోలం సృష్టించవచ్చు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగదు. ముఖ్యంగా ఏప్రిల్‌లో దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరించినప్పుడు.. జీవితంలో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి.
కర్కాటక రాశిఫలం 2023 : విద్య ఈ సంవత్సరం శని అడుగు పెట్టడంవలన విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు ఈ రాశిలో నాల్గవ ఇంట్లో ఉన్న రాహువు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. కర్కాటక రాశి విద్యార్థులు ఈ సంవత్సరం ఏకాగ్రతను కాపాడుకోవాలి. మరోవైపు విదేశీ విద్యాసంస్థల్లో అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఈ ఏడాది సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశిఫలం 2023 : ఆరోగ్యం సంవత్సరారంభంలో శని వలన ఈ రాశివారు కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంవత్సరంలో ఆకస్మిక వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే మీ ఆరవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి ఏప్రిల్‌లో మీనం నుండి మేషరాశిలోని ప్రవేశించి సంచరించిన వెంటనే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)