AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guru Margi: రుజు మార్గంలోకి గురువు.. ఆ రాశుల వారికి కొత్త సంవత్సరంలో మరిన్ని శుభ యోగాలు పక్కా..!

ఈ నెల 31వ తేదీ నుంచి గురువు వక్ర గమనాన్ని వదిలిపెట్టి రుజు మార్గంలో సంచారం ప్రారంభిస్తున్నాడు. గత సెప్టెంబర్ 5న మేష రాశిలో వక్ర గమనం ప్రారంభించిన గురు గ్రహం దాదాపు నాలుగు నెలల తర్వాత రుజు మార్గంలోకి రావడం జరుగుతోంది. గురువు వంటి శుభ గ్రహం వక్రించినప్పుడు సాధారణంగా నీతి నియమాలకు, సంప్రదాయాలకు, ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది.

Guru Margi: రుజు మార్గంలోకి గురువు.. ఆ రాశుల వారికి కొత్త సంవత్సరంలో మరిన్ని శుభ యోగాలు పక్కా..!
Guru Margi 2023
TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Dec 30, 2023 | 4:59 PM

Share

ఈ నెల 31వ తేదీ నుంచి గురువు వక్ర గమనాన్ని వదిలిపెట్టి రుజు మార్గంలో సంచారం ప్రారంభిస్తున్నాడు. గత సెప్టెంబర్ 5న మేష రాశిలో వక్ర గమనం ప్రారంభించిన గురు గ్రహం దాదాపు నాలుగు నెలల తర్వాత రుజు మార్గంలోకి రావడం జరుగుతోంది. గురువు వంటి శుభ గ్రహం వక్రించినప్పుడు సాధారణంగా నీతి నియమాలకు, సంప్రదాయాలకు, ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది. ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే తపన పెరుగుతుంది. ఇప్పుడు గురువు వక్ర త్యాగం చేయడం వల్ల న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ, న్యాయబద్ధంగా, నీతి నియమాలతో వ్యవహరించేవారికి కొత్త సంవత్సరంలో ఇతోధికంగా ఆర్థిక లాభాలు చేకూర్చడం జరుగుతుంది. గురువు వక్ర త్యాగం వల్ల మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు అత్యధికంగా ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఏప్రిల్ 30 వరకు ఈ రాశుల వారికి సదరు శుభ యోగాలు అనుభవంలోకి ఉంటాయి.

  1. మేషం: ఈ రాశివారికి పెండింగులో ఉన్న ఆర్థిక లాభాలన్నీ చేతికి అందడం ప్రారంభం అవుతుంది. కొద్ది పాటి కష్టం కూడా లేకుండా ఆర్థిక ప్రయత్నాలన్నీ మరింత వేగంగా పూర్తవడానికి అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి, వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకోవడానికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం ఉంటుంది. తల్లితండ్రులు లేదా దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చే సూచనలున్నాయి.
  2. మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువు ఇక పూర్తి స్థాయిలో జీవితంలో సానుకూల మార్పులు తీసుకు రావడం జరుగుతుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. కుటుంబంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రావడం ప్రారంభం అవు తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
  3. సింహం: ఈ రాశివారికి భాగ్యస్థానంలో ఎటువంటి దోషమూ లేకుండా ఉన్న గురువు వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి. ముఖ్యంగా మనసులోని కోరికలు నెరవేరడం ప్రారంభం అవుతుంది. వ్యక్తిగత సమస్యలు ఒక్కొటొక్కటిగా తొలగిపోతాయి. విదేశీ యానం, విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల్లో స్థిరత్వం వంటివి సానుకూలపడతాయి. ఇష్టమైన ప్రాంతాలకు, ఆలయాలకు వెళ్లి రావడం జరుగుతుంది. తండ్రి నుంచి అన్ని విధాలుగానూ సహాయ సహకారాలు అందుతాయి.
  4. తుల: ఈ రాశివారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురువు పూర్తి స్థాయిలో సానుకూల ఫలితాలను, శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభం అవుతుంది. పెండింగు పనులు, వ్యవహారాలను పూర్తి చేయడం మొదలవుతుంది. తద్వారా మరింతగా ఆర్థిక లాభం చేకూరుతుంది. జీవిత భాగస్వామికి కూడా మహా భాగ్య యోగం పడుతుంది. దాంపత్య జీవితం మరింత సుఖమయం అవుతుంది. అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇష్టమైన క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది.
  5. ధనుస్సు: ఈ రాశినాథుడైన గురువు రుజు మార్గానికి వచ్చినందువల్ల, ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఎటువంటి ఆటంకాలూ లేని పురోగమన జీవితం మీ ముందుకు వస్తుంది. అవినీతికి, అక్రమాలకు అవకాశం ఉండని జీవితం ఏర్పడుతుంది. ఆదాయ మార్గాలు పెరగడం, ఆదాయం వృద్ధి చెందడం వంటివి చోటు చేసుకుంటాయి. ఇంట్లో చాలాకాలంగా ఆగిపోయి ఉన్న శుభకార్యాలు జరగడం మొదలవుతుంది. సంతానం లేనివారికి సంతాన యోగం కలుగుతుంది. పిల్లలు వృద్దిలోకి వస్తారు.
  6. మీనం: ఈ రాశినాథుడైన గురువు ధన స్థానంలో వక్రించడం వల్ల జరిగిన ధన నష్టం క్రమంగా భర్తీ అవు తుంది. పెండింగులో ఉన్న ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు బాగా తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి కలసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. సంతానం అభివృద్ధి చెందు తుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.