ఆకాశంలో అద్భుతం.. వెయ్యేళ్ల తర్వాత ఒకే రేఖపై నాలుగు గ్రహాలు

ఖగోళంలో(Space) అంచనాకందని అద్భుతాలెన్నో. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు.. ఇలా ప్రతి ఒక్క అంశంలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే అంతరిక్షం గురించి పరిశోధనలు చేసేందుకు...

ఆకాశంలో అద్భుతం.. వెయ్యేళ్ల తర్వాత ఒకే రేఖపై నాలుగు గ్రహాలు
Planets
Follow us

|

Updated on: Apr 28, 2022 | 6:36 AM

ఖగోళంలో(Space) అంచనాకందని అద్భుతాలెన్నో. గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు.. ఇలా ప్రతి ఒక్క అంశంలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే అంతరిక్షం గురించి పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో బుధవారం(నిన్న) ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు వెయ్యేళ్ల తర్వాత నాలుగు గ్రహాలు(Planets) ఒకే రేఖపై దర్శనమిచ్చాయి. వీనస్, మార్స్, జుపిటర్, శాటర్న్ గ్రహాలు ఒకే రేఖపై కనిపించి..ఆశ్చర్యం కలిగించాయి. భువనేశ్వర్(Bhubaneshwar) ​లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్​ సువేందు పట్నాయక్​ఈ వివరాలు వెల్లడించారు. సౌర వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఒకే వరుసలోకి గ్రహాలు వచ్చే క్రమాన్ని ‘ప్లానెట్​ పరేడ్​’ అని పేర్కొంటారని ఆయన తెలిపారు. అంతరిక్షంలో సాధారణంగా మూడు ప్లానెట్​ పరేడ్​లు కనిపిస్తాయి. అందులో మొదటిది.. సూర్యుడికి ఒకవైపునకు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. మూడు గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకు కనిపించటం సర్వసాధారణం. ఒక ఏడాదిలో ఇలా చాలా సార్లు దర్శనమిస్తాయి. ఏడాదిలో ఒకసారి నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఐదు గ్రహాలు ఇలా ఒక వరుసలోకి వస్తాయి. 8 గ్రహాలు సైతం ఇలా ఒకే వరుసలోకి వస్తాయని.. కానీ అందుకు 170 ఏళ్లు పడుతుందని సువేందు పట్నాయక్ వెల్లడించారు.

2022 ఏప్రిల్​ 26, 27 తేదీల్లో సూర్యోదయానికి ఒక గంట ముందు, చంద్రుడితో పాటు నాలుగు గ్రహాలు తూర్పు అక్షాంక్షానికి 30 డిగ్రీల కోణంలో ఒకే వరుసలో కనిపించాయి. గతంలో సుమారు 1000 ఏళ్ల క్రితం క్రీ.శ 947లో ఇలా జరిగింది. పరిస్థితులు అనుకూలించి శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే.. టెలిస్కోప్ అవసరం​ లేకుండానే నేరుగా వాటిని చూడవచ్చు.

Also Read

Nani: ఓటీటీ విడుదల కానున్న న్యాచురల్ స్టార్ సినిమా.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు ప్రజలు బంగారం, వెండిని ఎందుకు కొనుగోలు చేస్తారో తెలుసా!..