Horoscope: మాట తొందర వల్ల వారికి లేనిపోని ఇబ్బందులు.. ఆ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి
ఈ రోజు రాశిఫలాలు చూస్తే వృత్తి, ఉద్యోగాల్లో చాలా మందికి పురోగతి కనిపిస్తుంది. ఆర్థికంగా ఆశాజనక పరిస్థితులు ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం కొనసాగుతుంది. కొన్ని రాశుల వారికి శుభవార్తలు, ఆకస్మిక లాభ సూచనలు ఉన్నాయి. అయితే మాటల్లో తొందర, ఇతరులపై అతి నమ్మకం సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాట తొందర వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం చాలావరకు ఉత్సాహంగా సాగిపోతుంది ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ గానే ఉన్నా ప్రతిఫలానికి లోటుండదు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. పిల్లలు విజయాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 2,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు.అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొం టారు. కుటుంబంతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టడం జరుగు తుంది. సొంత పనుల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఇతరుల బాధ్యతల్ని భుజాన వేసుకోవడం వల్ల నష్టపోతారు. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా పురోగ మిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభి స్తుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసి పోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సానుకూల ఫలితా లనిస్తాయి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ పెట్టడం అవసరం. దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనుకోని ఖర్చులు మీద పడతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలు మారిపోతాయి. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. చేపట్టిన పనులు చాలావరకు సఫలం అవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో ప్రాభవం, ప్రాధాన్యం పెరుగుతాయి. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి జీవి తంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పోటీదార్లతో ఇబ్బందులున్నప్పటికీ లాభాలకు లోటుండదు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు విజ యవంతంగా పూర్తవుతాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. జీవిత భాగస్వామికి చిన్నపాటి అదృష్టం పడుతుంది. ఆరోగ్యం పరవాలేదు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇత రుల మీద ఆధారపడకపోవడం మంచిది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెంచడం చాలా మంచిది. వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్ప కుండా నెరవేరుతుంది. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందు తాయి. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయానికి లోటుండదు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కొన్ని ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. నిరు ద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తిచేస్తారు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.