Horoscope Today: మీకు అంది వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..!
Daily Horoscope(July 29): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా? స్నేహితుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయా? ఆర్థికపరంగా ఎలా ఉండబోతుంది..? జూలై 29, 2023న(శనివారం) మేషం, వృషభం, మిథునం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
Daily Horoscope(July 29): జ్యోతిష్య రీత్యా గ్రహాలు, నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? జూలై 29, 2023న(శనివారం) మేషం, సింహం, కన్యారాశి, మకరం తదితర 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి,వ్యాపారాలు అభి వృద్ధి చెందడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరగడంతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలలో విజ యం సాధిస్తారు. ఏ పని తలపెట్టినా అది విజయవంతంగానే పూర్తవుతుంది. గృహ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. ఆస్తి సంబంధమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సోదరులతో అభిప్రాయభేదాలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అనుకోని మార్గంలో ఆదాయం కలిసి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపార వ్యవహారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త ఒకటి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు కూడా సాను కూల స్పందన లభిస్తుంది. అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపా రాలు వేగం పుంజుకుంటాయి. ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చవుతుంది. కుటుంబ సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ప్రయాణాలు చాలావరకు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో మరింతగా సయోధ్య పెరుగుతుంది. కొద్దిగా ఆలస్యంగానే అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఒక అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. నిరుద్యోగులు తమకు అంది వచ్చిన అవకాశాలను వీలైనంతగా సద్వినియోగం చేసుకోవాలి. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఖర్చులు తగ్గించుకోవాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. వృత్తి జీవితం చాలావరకు సాఫీగా, నిలకడగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు తగ్గే సూచనలున్నాయి. కొద్దిగా శ్రద్ధ పెంచడం మంచిది. ఉద్యోగం మారడానికి సంబంధించి ఆలోచించి నిర్ణయం తీసుకో వడం మంచిది. సకాలంలో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వీటివల్ల ఆర్థిక ప్రయోజ నాలు సిద్ధిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం పరవాలేదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): దూర ప్రాంత బంధు మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలను, వ్యూహాలను అమలు పరుస్తారు. ఉద్యోగులు సంతృప్తికరంగా విధులు నిర్వర్తిస్తారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ప్రస్తుతం అన్ని రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదన ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగు తుంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఇంటా బయటా ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అయితే, అప్రయత్నంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. మొండి బాకీ వసూలు అవు తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఏ పని తలపెట్టినా విజయ వంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అనేక విధాలుగా లాభాలు అందే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో మీ ఆలోచనలు, నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ సంపాదించడానికి అవకాశాలు మెరుగుపడ తాయి. ఆరో గ్యం మీద దృష్టి పెట్టడం మంచిది. శరీరానికి విశ్రాంతి అవసరం అని గ్రహించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): బంధువులు లేదా సోదర వర్గంతో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. మిత్రులతో ఒక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆలయానికి వెడతారు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆశించిన శుభవార్త వింటారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్య సంబంధమైన పరీక్షల్లో శుభ వార్తలు అందుతాయి. తలపెట్టిన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తప్పకుండా ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగుల శ్రమకు, ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగులకు అనుకోకుండా ఉన్నతావకాశాలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): పిల్లలు చదువుల్లో విజయాలు సాధిస్తారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో మీ వ్యూహాలు, మీ ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ధనపరమైన ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి