Star Sign: వృత్తి, ఉద్యోగాల పరంగా వారికి ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం.. ఆ నక్షత్ర జాతకులకు జీవితంలో కొత్త మలుపు

Star Astrology: గ్రహ సంచారం ప్రకారం ప్రస్తుతం గురువు, రాహువు, శని, రవి గ్రహాలు బలంగా ఉన్నాయి. ఇవి బలంగా ఉన్నందువల్ల ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు కూడా బలం పెంచుకుని అదృష్టం కలగజేస్తాయి. ఈ పరి‍స్థితి దాదాపు ఈ ఏడాది చివరి వరకూ కొనసాగుతుంది. రవి నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రాహు నక్షత్రాలైన ఆర్ద్ర, స్వాతి, శతభిషం, గురు గ్రహ నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర,

Star Sign: వృత్తి, ఉద్యోగాల పరంగా వారికి ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం.. ఆ నక్షత్ర జాతకులకు జీవితంలో కొత్త మలుపు
Astrology In Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 28, 2023 | 6:22 PM

Star Astrology: గ్రహ సంచారం ప్రకారం ప్రస్తుతం గురువు, రాహువు, శని, రవి గ్రహాలు బలంగా ఉన్నాయి. ఇవి బలంగా ఉన్నందువల్ల ఈ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు కూడా బలం పెంచుకుని అదృష్టం కలగజేస్తాయి. ఈ పరి‍స్థితి దాదాపు ఈ ఏడాది చివరి వరకూ కొనసాగుతుంది. రవి నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, రాహు నక్షత్రాలైన ఆర్ద్ర, స్వాతి, శతభిషం, గురు గ్రహ నక్షత్రాలైన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, శని నక్షత్రాలైన పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు జీవితం మంచి మలుపు తిరగబోతోంది. ఈ నక్షత్రాలకు చెందిన విద్యార్థులు ఘన విజయాలు సాధించడం, ఉద్యోగాలు సంపాదించడం, పెళ్లిళ్లు కావడం, విదేశాలకు వెళ్లడం, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరడం వంటివి సంపూర్ణంగా గానీ, పాక్షికంగా గానీ తప్పకుండా జరుగుతాయి. వ్యక్తిగత జాతక చక్రాలలోని గ్రహాల స్థితిగతులతో సంబంధం లేకుండా కూడా ఇందులో కొన్ని సానుకూల అంశాలు అనుభవానికి రావడం జరుగుతుంది.

  • కృత్తిక: వృషభ రాశిలో ఉన్న కృత్తిక నక్షత్రం వారికి ఈ ఏడాది తప్పకుండా దశ తిరుగుతుంది. అనుకోని మార్గంలో అదృష్టం పడుతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. పితృవర్గం నుంచి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి. చదువుల్లో, ఉద్యోగాల్లో పైకి రావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఎదురుండదు. ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు తదితరులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. విదేశీ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది.
  • ఆర్ద్ర: ఈ నక్షత్రం వారి జీవితం అనేక సానుకూల మలుపులు తిరుగుతుంది. చదువుల్లో, ఉద్యోగాల్లో పురోగతి తప్ప తిరోగమనం ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. విదేశీ ఉద్యోగాలకు, విదేశీ పెళ్లి సంబంధాలకు అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెడితే ఆ ప్రయత్నం చాలావరకు విజయవంతం అవుతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగుంటుంది.
  • పునర్వసు: పాదాలతో సంబంధం లేకుండా ఈ నక్షత్రం వారికి ఈ ఏడాది చివరి లోపల జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉన్నత విద్యలకు వెళ్లడం, ఉద్యోగావకాశాలు పెర గడం, పెళ్లి జరగడం, వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వీరికి గత ఏప్రిల్ నుంచే సమయం అనుకూలంగా ఉంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవు తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది.
  • పుష్యమి: అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ అవకాశాలు అందివస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో త్వరిత గతిన పురోగతి సాధించడం జరుగుతుంది. వ్యాపారాలు, స్వయం ఉపాధి వంటివి లాభాలు అందు కుంటాయి. విద్యార్థులు ఘన విజయాలు ‍సాధిస్తారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ, సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు ఆచరణలో పెడితే తప్పకుండా సఫలం అవుతారు. ఇంత వరకూ సహాయం పొందినవారు ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు.
  • ఉత్తర: రాజకీయ, ప్రభుత్వ, సామాజిక, పౌర సంబంధాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉన్నవారికి జీవితం సానుకూల మలుపు తిరుగుతుంది. తప్పకుండా అదృష్టం పడుతుంది. ఉద్యోగంలో అతి వేగంగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి జీవితంలో సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. వారసత్వ సంపద సంక్రమిస్తుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభవార్తలు వినడం జరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
  • స్వాతి: ఈ రాశివారికి అదృష్టం తలుపు తడుతుంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అది సఫలం అవు తుంది. వృత్తి, ఉద్యోగాలలో విశేషంగా రాణించడం జరుగుతుంది. విదేశాలలో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలలో లాభాల పంట పండుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడ తాయి. లాటరీలు, జూదాలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వంటి వాటి వల్ల కలిసి వస్తుంది.
  • విశాఖ: తులా రాశిలో ఉన్న విశాఖ నక్షత్రం వారు వృత్తి, ఉద్యోగాల పరంగా అనేక ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యలకు, విదేశీ ఉద్యోగాలకు తప్పకుండా అవకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిం చడం, వ్యాపారాల్లో లాభాలు పెరగడం, వివాహ ప్రయత్నాలు సఫలం కావడం వంటివి చోటు చేసు కుంటాయి. దాదాపు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా ఉండదు.
  • అనూరాధ: ఈ నక్షత్రం వారికి చదువుల్లోనూ, కెరీర్ పరంగానూ అదృష్టం పడుతుంది. వృత్తి విద్యా కోర్సుల్లో ఉన్న ఈ నక్షత్రం వారు తప్పకుండా ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారు వృత్తిపరంగానే కాక, వ్యాపారపరంగా కూడా ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం మీదే అవుతుంది. కుటుంబ సభ్యులు,జీవిత భాగస్వామి కూడా గుర్తింపు తెచ్చుకోవడం, పురోగతి సాధించడం జరుగుతుంది.
  • ఉత్తరాషాఢ: మకర రాశిలో ఉన్న ఈ నక్షత్రం వారికి వృత్తి, ఉద్యోగాల పరంగా ఊహించని అదృష్టాలు పట్టే అవకాశం ఉంది. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శత్రు,రోగ, రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయాలు, ప్రభుత్వం, పాలన, పౌర సంబంధాలు వంటి రంగాల్లో ఉన్నవారు అందలాలు ఎక్కుతారు. గౌరవ సత్కారాలు అందుకుంటారు. ఇంటా బయటా మాట చెల్లుబాటు అవుతుంది.
  • శతభిషం: ఈ రాశివారు వృత్తి, వ్యాపారాల్లో ఉన్న పక్షంలో వీరికి పట్టపగ్గాలు ఉండకపోవచ్చు. వీరి మనసు లోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఆశయాలు, ఆకాంక్షలు ఫలిస్తాయి. ఆర్థిక ప్రయత్నా లు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కోలుకునే అవకాశం ఉంది. దాదాపు ప్రతి రోజూ ఒక శుభవార్త వినడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవు తుంది.
  • పూర్వాభాద్ర: కుంభరాశిలో ఉన్న పూర్వాభాద్ర నక్షత్రం వారికి అన్నివిధాలుగానూ సమయం అనుకూలంగా ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆశయాలు, ఆకాంక్షలు కూడా నెరవేరుతాయి. ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం వంటివి ఏర్పడతాయి. సంతానం లేనివారికి సంతాన యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయ త్నాలు కూడా తప్పకుండా సఫలం అవుతాయి. విహార యాత్రలకు అవకాశం ఉంటుంది.
  • ఉత్తరాభాద్ర: మీన రాశిలో ఉన్న ఈ నక్షత్రం వారు దాదాపు అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. దాదాపు ప్రతి ఆర్థిక ప్రయత్నమూ కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విశేషంగా సంపాదన పెరుగుతుంది. రావాల్సిన బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి.ముఖ్యమైన రాజకీయ నాయకులతో, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వంలో ఉన్నవారికి ఆదాయానికి హద్దు ఉండదు. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయ. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది.

Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి