Capricorn Horoscope 2024: ఏలి నాటి శని జరుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది ఈ రాశివారికి ఏ విధంగా ఉంటుందంటే..

|

Dec 21, 2023 | 8:44 AM

మకర రాశి వారికి 2024 సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2024 సంవత్సరంలో కొంతమందిని కోల్పోవచ్చు. ఈ సంవత్సరం మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంవత్సరం చివరి భాగం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం పాత ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉంది.

Capricorn Horoscope 2024: ఏలి నాటి శని జరుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది ఈ రాశివారికి ఏ విధంగా ఉంటుందంటే..
Capricorn Horoscope 2024
Follow us on

మరికొన్ని రోజుల్లో 2023 కు గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరం 2024 కి స్వాగతం చెప్పడానికి రెడీ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన మంచి చెడులను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో 2024కి సంబంధించిన మకర రాశివారి  అంచనా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.. కొత్త ఏడాది  చాలా మార్పులు ఆశించవచ్చు. మకర రాశి వారికి 2024 సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే 2024 సంవత్సరంలో కొంతమందిని కోల్పోవచ్చు. ఈ సంవత్సరం మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. సంవత్సరం చివరి భాగం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం పాత ప్రణాళికలను అమలు చేసే అవకాశం ఉంది. మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా ఉంటారు. చేపట్టిన పని ఆగదు అయితే నిదానంగా పూర్తి చేస్తారు. జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు.

ఆర్ధిక ప్రయోజనాలు:

ధనానికి అధిపతి అయిన శని ద్వితీయంలో ఉండటం వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తుల సంపద స్థిరంగా ఉంటుంది. కొత్త ఆదాయంపై తక్కువ దృష్టి పెడతారు. అలాగే ఏలి నాటి శని వలన ఏదైనా ఆకస్మిక ఇబ్బందులు ఎదురయ్యే  అవకాశం ఉంది.

ప్రేమ, వివాహం:

ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులకు వివాహానికి గురుబలము ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వచ్చి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం మీ వివాహం, నిశ్చితార్థం జరిగే శుభ అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు సంవత్సరం రెండవ భాగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ భాగస్వామిని అర్థం చేసుకోవాలి. చిన్న విషయాలను మరచిపోవడం మంచిది. ప్రేమికులు లేదా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. వాదనలకు దూరంగా ఉండడం మంచిది.

ఇవి కూడా చదవండి

వృత్తి:

సంవత్సరం ప్రారంభంలో శుక్రుడు ఈ రాశికి చెందిన వారి కెరీర్‌లో స్థిరత్వాన్ని ఇస్తాడు. మార్చి నెలాఖరులో ఇప్పటి వరకు తలెత్తిన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సహనం పెంపొందించుకోవాలి.

ఆరోగ్య స్థితి:

ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జూలై, సెప్టెంబరు నెలల్లో ఆరోగ్యం క్షీణిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో కూడా జ్వరం, కాళ్ళు, తుంటి నొప్పి వంటి వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా సంవత్సరం మొదటి సగం మంచిదని, అయితే సంవత్సరంలో రెండవ సగం కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే మారుతున్న సీజన్ వలన సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.  ఎటువంటి పెద్ద వ్యాధితో బాధపడరు. కనుక సీజన్లలో అనారోగ్యం బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. సంవత్సరం ద్వితీయార్థంలో మీరు కొంత ఆందోళనకు గురవుతారు. ఇది కొన్ని పనిని పూర్తి చేయలేకపోవడం వల్ల కావచ్చు లేదా ఎవరితోనైనా అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆహారపు అలవాట్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరంగా చింతించకండి. మీ వాహనాన్ని సరిగ్గా నడపండి.

విద్య:

ఈ ఏడాది మొదటి సగం విద్యార్థులకు చాలా మంచిదని, ద్వితీయార్ధంలో కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. తెలివితేటలు, జ్ఞానం సరైన మార్గాన్ని చూపుతాయి. ఈ సమయంలో విద్యావంతులను కలుస్తారు. ఈ సమయంలో చదువుకోసం ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి చాలా ఖచ్చితమైనవిగా ఉండేలా చూసుకోవాలి. ఉపాధ్యాయులతో సంబంధాలు చాలా బలంగా మారతాయి. ఏడాదిలో రెండవ అర్ధ భాగం లో స్టూడెంట్స్  కష్టపడి పని చేయాలి. అప్పుడే విజయం సాధించగలరు. అయితే విద్యార్థులు మంచి విజయం సాధించగలరు.

నివారణ చర్యలు:

ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఏలిన నాటి శని నడుస్తోంది. కనుక ప్రతి శనివారం శనిస్తోత్రం, నువ్వుల దీపం వెలిగించండి. రోజు తప్పకుండా హనుమాన్ చాలీసా జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు