Astrology 2026: ఆ రాశుల వారి కొత్త సంవత్సర నిర్ణయాలు ఫలించడం పక్కా..!
కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి తమ నిర్ణయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. అనుకూల గ్రహ స్థితుల వల్ల వీరు ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో విజయం సాధిస్తారు. గురు, శని, రాహువు వంటి గ్రహాల ప్రభావంతో సంపద, విదేశీ ప్రయాణాలు, రాజకీయ విజయం, ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది.

New Year 2026 Astrology
కొత్త సంవత్సరంలో చాలామంది కొత్త నిర్ణయాలు తీసుకోవడం సహజంగా జరుగుతుంటుంది. అయితే, కొన్ని రాశులవారికి మాత్రమే వారు తీసుకునే నిర్ణయాలు ఫలించే అవకాశం ఉంది. ఎటువంటి నిర్ణ యాలు తీసుకుంటే మంచిది? ఎన్నాళ్లలో ఫలిస్తాయి! ఇటువంటి ప్రశ్నలకు జ్యోతిష పరంగా సమాధానాలు చూడవలసి ఉంటుంది. వచ్చే ఏడాది రాశులు మారబోయే గ్రహాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే విషయాన్ని బేరీజు వేయవలసి ఉంటుంది. గ్రహాల స్థితిగతులను బట్టి వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు తీసుకునే నిర్ణయాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు ఫలించే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశివారికి కుటుంబం, ధనం చాలా ముఖ్యమైనవి. ఆదాయ వృద్ధికి సంబంధించి వీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరుగుతుంది. గురు, శనులతో పాటు రాహువు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వీరి ఆదాయం వీరి ప్రయత్నాలకు తగ్గట్టుగా పెరగడం ప్రారంభిస్తుంది. వీరు తప్పకుండా సంపన్నులవుతారు. కుటుంబానికి తగిన భద్రత కల్పిస్తారు. కుటుంబ సభ్యుల్ని వృద్ధిలోకి తీసుకువస్తారు.
- మిథునం: సాధారణంగా మిథున రాశివారికి విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలని, కొత్త ప్రదేశాలను సందర్శించాలని ఎక్కువగా కోరుకుంటారు. గురు, రాహువులతో పాటు దశమంలో ఉన్న శని కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం, అక్కడే స్థిరపడడం వంటివి జరుగుతాయి. భాగ్య స్థానంలోని రాహువు వల్ల వీరికి విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతుంది. వచ్చే ఫిబ్రవరి నుంచి వీరు అనేక దేశాలు, కొత్త ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.
- కన్య: వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల స్థానాల్లో ఉన్నప్పటికీ ఈ రాశివారికి సొంత వ్యాపారం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం ప్రారంభించాలన్న వీరి నిర్ణయం కొత్త ప్రారంభంలోనే అమలు జరిగే అవకాశం ఉంది. సాధారణంగా మిత్రులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. దశమ, లాభ స్థానాల్లో ధన కారకుడు గురువు సంచారంతో పాటు సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల వ్యాపారాల్లో తప్పకుండా రాణించడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి.
- తుల: ఉద్యోగంలో ఉన్నప్పటికీ సమాంతరంగా వ్యాపారాలు చేయడం ఈ రాశివారి విషయంలో ఎక్కు వగా జరుగుతుంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా వీరిని మించినవారుండరు. ఉద్యోగానికి స్వస్తి చెప్పి వ్యాపారాలు చేపట్టడానికి వీరు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాశ్యధిపతి శుక్రుడితోపాటు వ్యాపార కారకుడైన బుధుడు, ధన కారకుడు గురువు అనుకూలంగా ఉన్నందువల్ల వీరి వ్యాపారాలు లాభాల పంట పండిస్తాయి.
- ధనుస్సు: ఏ రంగంలోనైనా అగ్ర స్థానంలో ఉండాలన్న వీరి తపన కొత్త సంవత్సరంలో నెరవేరే అవకాశం ఉంది. అధికారం చేపట్టడానికి సంబంధించి వీరు కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను, శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. అధికారులను తమ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత పదవులను చేపట్టడం, వృత్తి, వ్యాపారాల్లో అగ్రస్థానానికి చేరుకోవడం తప్పకుండా జరుగుతుంది.
- కుంభం: ఈ రాశివారికి రాజకీయాలు, ప్రజా సేవ, పౌర సంబంధాలు వంటి అంశాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు రాజకీయాల్లో చేరాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లోనే కాక, ప్రజా సేవలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. గురు, శనుల బలం బాగా అను కూలంగా ఉండబోతున్నందువల్ల వీరు ఈ రంగాల్లో పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడం వంటివి జరుగుతాయి.



