Astrology: ఆ రాశుల వారికి కొత్త జీవితం..! మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
చంద్ర గ్రహంతో ఏర్పడే యోగాలు తప్పకుండా ఫలిస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. చంద్రుడి సంచారంతో ఏర్పడే ఏ యోగమైనా తక్కువ రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తక్కువ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో తప్పకుండా అత్యుత్తమ ఫలితాలనిస్తాయని జ్యోతిషశాస్త్రం పేర్కొనడం జరిగింది. ఈ నెల(డిసెంబర్) 3, 4, 5 తేదీల్లో వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం ఒక విశేషంగా కాగా, ఈ పౌర్ణమి చంద్రుడిని మీన రాశి నుంచి శనీశ్వరుడు, వృశ్చిక రాశి నుంచి రవి, కుజ, శుక్ర గ్రహాలు వీక్షించడం మరో విశేషం. ఈ మూడు రోజులూ వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశులకు పండుగ రోజులే. ఆ రోజు మనసులో కోరుకున్నవి తప్పకుండా నెరవేరుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6