- Telugu News Photo Gallery Spiritual photos If there are cracks in the walls of the house, it means that there is this Vastu defect
మీ ఇంటి గోడకు పగుళ్లు వస్తున్నాయా? అయితే ఈ వాస్తు దోషం ఉన్నట్లే!
ఇంటి గోడలకు పగుళ్లు రావడం అనేది కామన్. అయితే కొన్ని సార్లు కొత్తగా నిర్మించిన ఇంటి గోడలకు కూడా పగుళ్లు ఏర్పడుతుంటాయి. అయితే సంకేతాలు అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంటిలోని గోడ పగుళ్లు కూడా వాస్తు దోషాలను సూచిస్తాయంట. కాగా, దాని గురించే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 02, 2025 | 4:48 PM

వాస్తు శాస్త్రం ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఎవరైతే వాస్తు నియమాలను ఉల్లంఘిస్తారో, వారు అనేక ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. కాగా, జీవితంలోని సమస్యల నుంచి బయటపడాలి అంటే వాస్తు ప్రకారం పాటించాల్సిన టిప్స్ ఏవో చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి గోడలు అకస్మాత్తుగా పగుళ్లు ఏర్పడితే, అందులో వాస్తు దోషం ఉన్నట్లేనంట. ఇలాంటి సమయంలో ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు అవ్వడం, ఎప్పుడూ వాదనలు , మనశ్శాంతి లోపించడం జరుగుతుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటిలోనైతే పనికి రాని వస్తువులు, చెత్త పేరుకపోతుందో, ఆ ఇంటిలో శక్తి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందంట. అందుకే ఎప్పుడూ కూడా స్టోర్ రూమ్‌ల్లో ఉన్న పాతవి, పనికి రాని వస్తువులను తీసివేయాలంట.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోకి సూర్యకాంతి సరిగ్గా రాకపోతే, ఆ ఇల్లు ఎప్పుడూ చీకటిగా ఉంటే అది కూడా వాస్తు లోపాన్ని సూచిస్తుందంట. అందువలన ఇంటిలోకి సరిగ్గా వెలుతురు వచ్చేలా చూసుకోవాలి అంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు.

అదే విధంగా ఇంటిలోని నీరు తప్పుడు దిశలో ప్రవహించినా, అలాగే, గోడలపై పగుళ్లు, పెయింట్ ఊడిపోవడం కూడా వాస్తులోపాలను సూచిస్తుంది. కొన్ని సార్లు ఇంటిలో శక్తి బలహీనంగా ఉండటం వలన ఇలా జరుగుతుంది. దీని వలన ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావాల్సి వస్తుందంట.



