- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: It is inauspicious to make chapati these days
వాస్తు టిప్స్ : ఈ ఐదు రోజుల్లో చపాతీ చేయడం పాపం!
ఇంటిలోపల రోజూ రోటీలు తయారు చేయడం అనేది కామన్. కానీ కొన్ని ప్రత్యకమైన రోజుల్లో రోటీలు తయారు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని రోజుల్లో ఇంటిలో పెనంపై రోటీ కాల్చడం అశుభకరమైనదంట. కాగా, ఏ రోజుల్లో ఇంటిలోపల రోటీ కాల్చ కూడదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 02, 2025 | 5:00 PM

వాస్తు శాస్త్రం అనేది ఒక వ్యక్తి జీవితంలో, కుటుంబంపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కానీ కొందరు వాటిని పాటిస్తే, మరికొందరు విస్మరిస్తారు.కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం, ఏ రోజుల్లో ఇంటిలో రోటీ చేయకూడదో చూద్దాం.

ఇంటిలోపల ఎవరైనా చనిపోయినప్పుడు ఇంటిలో రోటీ చేయడం అశుభకరం, ఇది పాపంతో సమానం అంట. ఎందుకంటే? ఎవరి ఇంటిలోనైతే వ్యక్తి మరణిస్తాడో, వారి ఇళ్లు మొత్తం దు:ఖంతో నిండిపోతుంది. అలాంటి సమయంలో ధాన్యాలు అపవిత్రంగా మారుతాయి. కాబట్టి, మరణం తర్వాత పదమూడవ రోజు వరకు ఇంటిలో రోటీ వండకూడదంట.

శ్రాద్ధ పక్షం సమయంలో రోటీ చేయడం అస్సలే మంచిది కాదంట. ఈ రోజున పూర్వీకులను సమ్మరిస్తూ, వారిని గౌరవిస్తూ వివిధ వంటకాలు తయారు చేస్తారు. అయితే ఇటువంటి సమయంలో కూడా రోటీలు చేయడం అశుభకరం అంటున్నారు నిపుణులు.

దీపావళి చాలా ప్రత్యేకమైనది. ఈరోజున ప్రతి ఒక్కరూ విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. అయితే ఇలాంటి ప్రత్యేకమైన రోజున రోటీలు చేయకూడదంట. ఈ రోజు రోటీ చేయడం వలన లక్ష్మీదేవి కోపానికి గురి అవుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

అదే విధంగా అమావాస్య రోజు కూడా ఇంటిలో రోటీ చేయడం అశుభకరం అంటారు. అందుకే చాల మంది ఇంటిలోపల అమావాస్య రోజు రోటీ చేయరు, ఒక వేళ చేస్తే, ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయని అంటుంటారు.



